ఎంపీ చనిపోయినా పిచ్చ లైట్.. బడ్జెట్ ఆగదంతే... | MP's death no shadow over Budget presentation.

No postponement of budget over mp e ahamed s death

Budget 2017, MP Death Budget Session, No postponement of Budget, Union Budget 2017, Budget 2017, MP E Ahamed dead, Congress Budget Postponement, Parliament Rules

There is intense speculation surrounding the presentation of the union budget by finance minister Arun Jaitley on Wednesday after the death of former union minister and IUML MP E Ahamed. Government sources told that there is no rule prohibiting the House from functioning due to the death of a sitting MP. It is only a convention, not a rule.

బడ్జెట్ ఆగదు.. మరికాసేపట్లో చర్చ

Posted: 02/01/2017 10:41 AM IST
No postponement of budget over mp e ahamed s death

భారత పార్లమెంట్ సంప్రదాయాలు పాటిస్తూ, ఒక ఎంపీ చనిపోతే సభను వాయిదా వేయాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం లైట్ తీస్కుంది. ఫిబ్రవరి 1వ తేదీతో ముద్రితమైపోయి సిద్ధంగా ఉన్న బడ్జెట్ ను ముందనుకున్న ప్రకారమే సభ ముందుంచాలని నిర్ణయించుకుంది. కాసేపటి క్రితం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ విషయమై నిర్ణయం తీసుకుంది. అహ్మద్ మృతికి సంతాపం తెలీపాకే, బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీ చనిపోతే వాయిదా వేయాలన్న నిబంధన లేదంటూ స్పీకర్ కూడా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలపటంతో 11 గంటలకు జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నాడు.

ఇప్పటికే బడ్జెట్ ప్రతులు పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సైతం పార్లమెంట్ కు వచ్చి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. బడ్జెట్‌ను యధావిధిగా ప్రవేశపెట్టాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం తీరును విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ఒకవైపు సహచరుడు మరణించి ఉండగా, సభను జరపడడం, బడ్జెట్‌ను ప్రకటించడం సంప్రదాయానికి విరుద్ధమని కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బడ్జెట్‌ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) కూడా కాంగ్రెస్‌తో గొంతు కలిపింది. బడ్జెట్‌ రేపటికి వాయిదావేయాలని సర్కారును కోరింది.

అయినా అవేం పట్టించుకోని ప్రభుత్వం సజావుగా సాగేందుకు సహకరించాలని పార్టీలను కోరుతోంది. ఇక పద్దులలో పన్ను వ్యవస్థలో పలు మార్పులు, ఉపాధీ హామీలకు పెరగనున్న నిధులు, గృహరుణాలపై ఊరట, ఆదాయపన్ను శ్లాబ్స్ మారే అవకాశం ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MP E Ahamed  Dead  Budget  2017  Postpone  

Other Articles