నిన్నమొన్నటి వరకు అమెరికా.. తాజగా జర్మనీ.. ఇలా పాశ్చాత్య దేశాలు క్రమంగా తమ భారత్ సహా భారతీయులపై తమ దురంహంకార పూరిత వైఖరిని ప్రధర్శిస్తున్నాయి. తాజాగా భారత సంతతికి చెందిన సింగపూర్ మహిళ పట్ల జర్మనీ విమానాశ్రయంలో ఓ పోలీసు ప్రవర్తించిన అమానవీయంగా ప్రవర్తించారు. అమెను దారుణ మాటలతో అవమానపర్చారు. అంతటితో అగకుండా అమెను ఓ మహిళా పోలీసు అధికారితో పరీక్షించిన తరువాత కానీ వదలిపెట్టలేదు. తనకు జరిగిన అమానవీయ చర్యపై అమె న్యాయం కావాలని కోరుతుంది. తనపట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గాయత్రీ బోస్ అనే మహిళ సింగపూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల బాబు, ఏడునెలల పాప ఉన్నారు. గత గురువారం ఆమె పారిస్ వెళ్లేందుకు బెర్లిన్‌లోని ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె లగేజీని ఎక్స్‌రే మిషన్ ద్వారా అధికారులు చెక్ చేయగా అందులో బ్రెస్ట్ పంప్ లభ్యమైంది. వెంటనే గాయత్రి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఓ మహిళా పోలీసు అధికారి ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్లి 45 నిమిషాలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
‘‘నువ్వు పాలిచ్చే తల్లివేనా? అయితే.. నీ బిడ్డ లేకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావ్. నీ మీద మాకు అనుమానాలున్నాయ్. ఓసారి జాకెట్ విప్పు.. చనుబాలు పితికి చూపించు’’ అంటూ అమానవీయ చర్యలకు పూనుకుంది. ‘‘గదిలోకి తీసుకెళ్లిన మహిళా పోలీసు.. జాకెట్ విప్పి పాలిండ్లను చూపెట్టు అంటూ గద్దించింది. తర్వాత పాలు వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు రొమ్ములను ప్రెస్ చేసింద’’ని గది లోపల తాను అనుభవించిన వ్యథనంతా చెప్పుకొని గాయత్రి కన్నీటి పర్యంతమయ్యారు.
కొద్దిసేపటికి బ్రెస్ట్ పంప్‌ను పరీక్షించి, పారిస్ వెళ్లేందుకు అనుమతిస్తూ పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేశారని ఆమె పేర్కొంది. తన పట్ల వ్యవహరించిన తీరుపై అధికారులను నిలదీశానని, అయితే.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది.. ఇక వెళ్లు’’ అంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితురాలు పేర్కొంది. కాగా ఈ ఘటనపై స్పందించేందుకు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించారు. ఎల్లిస్ టేలర్ అనే ఎవియేషన్ నిపుణుడు మాత్రం స్పందిస్తూ.. ఓ మాతృమూర్తిని పట్టుకొని రొమ్ములను చూపెట్టమనడం.. రరొమ్ములను ప్రేస్ చేయడంలో అర్థం లేదని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more