పాత పెద్ద నోట్ల రద్దుతో తిరోగమనం బాట పట్టిన రియల్ ఎస్టేట్ రంగానికి జోష్ పెంచే కార్యక్రమానికి పూనుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గృహలపై రుణాలను మరింత చౌకగా లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు జైట్లీ బడ్జెట్లో రూ.20వేల కోట్ల గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్టు సభలో ప్రకటించారు. అదేవిధంగా హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనతో డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి.
అంతేకాక పెట్టుబడిదారులను ఆకర్షించనుంది. వనరుల కేటాయింపులు పెంచడానికి ఈ స్టేటస్ ఎంతో సహకరించనుంది. దీంతో హౌసింగ్ సప్లైలు పెరిగి, డిమాండ్ తగ్గనుంది. మౌలిక సదుపాయాల కల్పినకు రూ.3,96,134 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అడిగిన గడువు ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోనే వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సరసమైన గృహాల కోసం మౌలిక సదుపాయాల స్టేటస్ను కల్పించారు.
దీంతో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019 నాటికి పేదరికాన్ని తరమికొట్చేందుకు కూడా పటిష్ట చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు గానే ప్రధాన మంత్రి అవాస్ యోజనకు నిదులను భారీగా కేటాయించారు. గతంలో 15 వేల కోట్ల కింద వున్న కేటాయింపులను ఏకంగా 23 వేల కోట్లకు పెంచారు. దీంతో ఈ పథకం కింద మరో రెండేళ్లలో కోటి గృహాలను నిర్మించనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలతో పాటు పూరిళ్లలో నివసించేవారికి కేటాయిస్తామన్నారు. దేశంలోని 50 వేల గ్రామ పంచాయితీలను పేదరికం లేని పంచాయితీలుగా తీర్చిదిద్దుతామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more