రాజమౌళి బాహుబలి క్రేజ్ ఎంతగా పాకిపోయిందంటే... విగ్రహాలు, కేక్, చాక్లెట్లు, బిర్యానీలు ఇలా దేన్ని వదలకుండా వాడేసుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరో ప్రభాస్ శివలింగాన్ని అమాంతం తన భుజంపైకి ఎత్తుకుని వెళ్లే దృశ్యంతో కూడినవే ఎక్కువగా దర్శనమిచ్చాయి. ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ పాట ప్రేక్షకులను ఎమోషనల్ గా ఎంతగా కట్టిపడేసాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఏకంగా ఓ ముఖ్యమంత్రిని ఆ వీడీయోలో ఇరికించేశారు కొందరు. ఉత్తరాఖండ్ సీఎం, కాంగ్రెస్ పార్టీ నేత హరీశ్ రావత్ తాజాగా ‘బాహుబలి’ అవతారమెత్తారు.
ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాస్త్రం కింద ‘బాహుబలి’లోని ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నారు. ‘ఎవ్వరంట.. ఎవ్వరంట..’ అనే పాట బ్యాక్ గ్రౌండ్ తో ‘బాహుబలి-2’ పేరిట ఉత్తరాఖండ్ లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాహుబలి గా హరీశ్ రావత్ కనిపిస్తారు. ఆయనకు ఎదురుగా మ్యాప్ ఆకారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంటుంది. దానిని తన భుజాల పైకి ఎత్తుకుని హరీశ్ రావత్ నడిచి వెళ్తుంటే.. దానిని చూసి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆశ్చర్యపోతున్న దృశ్యం మనకు కనపడుతుంది.
మరో విషయమేమిటంటే.. ‘బాహుబలి’లో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకుని తన భుజంపై పెట్టుకున్నప్పుడు సాధువు పాత్రలో తనికెళ్ల భరణి ని రీప్లేస్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని చూపించారు. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీశ్ రావత్ అనే టైటిల్ వస్తుండగా ‘ఎవ్వరంట..ఎవ్వరంట..’ అనే పాట మొదలవడం.. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ ప్రాంతాల చిత్రాలు ఒక దాని తర్వాత మరోటి స్పీడ్ గా కదిలిపోగానే హరీశ్ రావత్ కనిపించడం గమనార్హం. ‘బాహుబలి’ చిత్రంలోని ఈ సన్నివేశాల్లోని నటీనటుల ముఖాలను మార్ఫింగ్ చేసి, ఈ వీడియోను ఉత్తరాఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రూపొందించారని చెప్పుతుండగా, కాంగ్రెస్ మాత్రం మాకేం సంబంధం లేదని చెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 15న ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more