జయ మృతిపై ఆ డాక్టర్ పెదవి విప్పాడు.. ఇక ఏం జరగబోతుంది... | Richard Beale Explains Jayalalitha Expiry.

Apollo hospital clarity on jayalalithaa treatment and death

Apollo Hospital Jayalalitha, Apollo Hospital On Jayalalitha Death, London Doctor Richard Beale, Richard Beale Jayalalitha, Tamil Nadu Ex CM Jayalalitha, Jayalalitha Expire, Jayalalitha Treatment, Jayalalithaa Richard Beale, Richard Beale Press Meet

London Doctor Richard Beale Explains about Tamil Nadu Ex CM Jayalalitha Treatment and Expiry.

ITEMVIDEOS:అమ్మ మృతి... అలా జరిగిందన్నమాట!

Posted: 02/06/2017 02:53 PM IST
Apollo hospital clarity on jayalalithaa treatment and death

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు అందించిన చికిత్సపై నివేదిక ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెన్నై అపోలో ఆస్పత్రి ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధమంటూ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు కూడా. ఈ మేరకు చికిత్సకు సంబంధించిన వివరాల కాసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు.

జయలలితకు లండన్ వైద్యుడు రిచర్డ్ బీలే వైద్యం అందించాడు. ఇక ఆయనే ఈ విషయంపై స్వయంగా వివరణ ఇచ్చాడు. సెప్టెంబర్ 22న ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలోనే జయలలిత తీవ్ర ఇన్ ఫెక్షన్ కి గురై ఉంది. పైగా షుగర్ ఉండటం మూలంగా శరీరంలోని అవయవాలన్నీ పాడయిపోయాయని తెలిపింది. అధిక రక్తపోటు కారణంగానే ఆమె త్వరగా కోలుకోలేకపోయారు. ముందు వెంటిలేషన్ ద్వారానే ఆమెకు ట్రీట్ చేసిన వైద్యులు, క్రమక్రమంగా కోలుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు.

అంతేకాదు ఉపఎన్నికలకు సంబంధించి ఈసీ పంపిన నోటిఫికేషన్ ను స్వయంగా బీలేనే చదివి వినిపించాక, ఆమె వేలిముద్ర వేశారని వివరించాడు. వారం పాటు సవ్యంగా ఉన్న ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా మారిపోయిందని, ఉన్నపళంగా డిసెంబర్ 5 11.30 నిమిషాలకు హర్ట్ ఎటాక్ రావటంతో ఆమె మరణించిందని తెలిపాడు. ఎవరైనా చికిత్స పొందుతున్నప్పుడు ట్రీట్ మెంట్ ను సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం సరికాదని రిచర్డ్ బేలే తెలిపారు. పేషెంట్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంటే... ఫొటోలు, వీడియోలు ఎలా తీయగలమని ప్రశ్నించారు.

తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. తాము వైద్యులం మాత్రమేనని... విధాన రూపకర్తలం కాదని చెప్పారు. కేవలం వైద్యపరమైన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వగలమని తెలిపారు. ఇక జయ చికిత్సకు రూ. 5.5 కోట్లు ఖర్చయిందని అపోలో వైద్యుల తెలిపారు. అంతేకాదు చికిత్సకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదిక సీల్డ్‌ కవర్‌ లో అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇదివరకే మద్రాస్‌ హైకోర్టుకు తెలిపినట్లు చెప్పింది కూడా.

 

అన్నాడీఎంకే లోని కొందరు ముఖ్యనేతలే జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇంతకు ముందు మద్రాస్‌ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే జయలలిత రక్త సంబంధీకులు తమను ఆశ్రయించనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు పిటిషనర్‌కు ఉందా? అని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది కూడా. అయితే జయలలిత మృతిపై పిటిషనర్‌కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు ఆ సందర్భంగా వ్యాఖ్యానించటం కొసమెరుపు. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Richard Beale  Jayalalithaa Death  Press Meet  

Other Articles