ప్రభుత్వాల నిర్లక్ష్యమో లేక నిర్వాహకుల కక్కుర్తో తెలీదుగానీ ఓ ఆశ్రమంలో జరుగుతున్న నీచ కార్యాకలాపాలు వెలుగులోకి రావటంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న ఆ ఆశ్రమం తీరుని పరిశీలించిన మహిళా కమిషన్ కు షాక్ కొట్టినట్లయ్యింది. ముఖ్యంగా మహిళలు బహిరంగంగానే బట్టలు మార్చుకోవటం, పైగా అవి సీసీ కెమెరాల్లో రికార్డు కావటం మరీ దారుణం.
ఆశా కిరణ్ అనే ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో మహిళలు, పిల్లలు ఉంటున్నారు. గత రెండు నెలల్లోనే సుమారు 11మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా, కొందరు బృందం సభ్యులు ఆ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. శనివారం రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలించి విస్తుపోయారు.
స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారని చెప్పారు. ఆశ్రమంలో మానసిక వికలాంగులైన మహిళలు పూర్తి నగ్నంగా అటు ఇటూ తిరుగుతున్నారని స్వాతి మాలివాల్ చెప్పారు. ఆశ్రమంలోని కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయని, వాటిని పురుషులు ఆపరేట్ చేస్తున్నారని తెలిపారు. ఈ దృశ్యాలన్నీ చూసి తాము షాక్కు గురయ్యామని చెప్పారు. ఆశ్రమంలో పరిశుభ్రత లేదని, అవసరమైన సంఖ్యలో ఉద్యోగులు కూడా లేరని అన్నారు. అక్కడ నివసిస్తోన్న మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని, 350 మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మంది మానసిక వికలాంగులను ఉంచారని, దీనిపై ఇప్పటికే తాము సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. 72గంటల్లో తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తాము కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more