పన్నిర్ వర్గం అశలు అవిరి.. సంబరాల్లో శశికళ జట్టు Breather for Sasikala: No SC verdict in DA case this week

Sc might postpond verdict in da case against sasikala

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, supreme court,O.Panneerselvam, VK Sasikala, letter, betray, vidyasagar rao, PM modi, Governor, tamil politics

The Supreme Court is unlikely to pronounce judgement in the 66.65 crore disproportionate assets case against VK Sasikala, this week and might postpond further.

పన్నిర్ వర్గం అశలు అవిరి..? సంబరాల్లో శశికళ జట్టు

Posted: 02/10/2017 10:04 AM IST
Sc might postpond verdict in da case against sasikala

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ విశ్లేషకు అంచానాలకు కూడా అందని విధంగా సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న అంశం మరింత అసక్తిని రేపుతుంది. ముఖ్యమంత్రి  పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్న శశికళ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలవడంతో తమిళ రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంపైనే వారిద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉందని తేలడంతో తమిళనాడ రాజకీయాలు ఇలా వుండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు ఎవరి ఇష్టానుసారం వారు అంచనాలు వేస్తున్నారు.

అసెంబ్లీలో బల నిరూపణకు పన్నీర్‌ సెల్వానికి గవర్నర్ ఐదు రోజుల సమయం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే మంగళవారం లేదంటే బుధవారాల్లో పన్నీర్ సెల్వం బలప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఈ లోగా అమెపైనున్న అక్రమాస్థుల కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తుందని భావించిన పన్నీరు సెల్వం వర్గం ఆశలు అవిరికానున్నాయి. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే పక్షనేత శశికళకు భారీ ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న శశికళపై తీర్పు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పు ఆలస్యం అయితే శశికళకు సీఎం పీఠం అధిష్టించే చాన్స్ ఎక్కువ అవుతుంది. కోర్టు తీర్పు ఆలస్యానికి స్పష్టమైన కారణం తెలియకున్నా వాయిదా మాత్రం పక్కా అని చెబుతున్నారు. ఈ కేసులో కోర్టు కనుక శశికళను దోషిగా నిర్ధారిస్తూ తీర్పిస్తే శశికళ శకం ముగిసినట్టే. సీఎం పగ్గాలు అందుకోవాలని భావిస్తున్న ఆమెకు తీర్పు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాదు కొంతకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. కోర్టు తీర్పు వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తతో శశికళ వర్గం సంబరాలు చేసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles