తమిళనాట రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో తమకు అండగా వున్న ఎమ్మెల్యేలను ఎవరికి వారు అత్యంత భద్రంగా వుంచుకోవాలని ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. వారి వ్యూహాలలో భాగంగా బయటివారు అయితే ఎలాగైనా మోసం చేకూరుతుందేమోనన్న అనుమానాలు బలంగా వున్న చిన్నమ్మ శశికళ మాత్రం మరో అడుగు ముందుకేసీ మరీ తన వర్గం ఎమ్మెల్యేల బాధ్యతలను సోంత కుటుంబసభ్యులకే అప్పగించిందన్న వార్తలు ఇప్పుడు తమిళనాట గుప్పుమంటున్నాయి.
బుధవారం రోజు తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కే సమయంలోనే వారిని విడుదల చేయాలని తీసుకెళ్లిన శశికళ.. అనుకున్నట్లుగానే పావులు కదుపుతుంది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానానికి తమిళనాడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వున్నారని.. సమావేశం ఏర్పాటు నేపథ్యంలో శశికళ అదేశం మేరకు వారు వచ్చారని ఆ తరువాత వారు ఎమ్మెల్యే క్వార్టర్లలోనే వున్నారని చెప్పారు.
అయితే ఇలా క్యాంపు రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో శశికళ వర్గం ఎమ్మెల్యేలను బంధీలుగా వుంచిందని, వారిని అక్రమంగా కిడ్నాప్ చేసిందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు మీడియా కంట పడకుండా శశికళ వర్గం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని.. ఒక్కో ఎమ్మెల్యేకు తనకు చెందిన ఇద్దరు అనుచరులను బాడీగార్డులుగా నియమించారన్న వార్తుల కూడా వినబడుతున్నాయి. బాడీగార్డుల కళ్లుగప్పి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలోని నాలుగు రిసార్టులలో ముఫ్పై మంది ఎమ్మెల్యే చోప్పున విభజించి పంపారని తెలుస్తుంది.గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ వర్గ ఎమ్మెల్యేలు వున్నారన్న వార్తలు రావడం, మీడియా ప్రతినిధులు వారిని చిత్రీకరించిన నేపథ్యంలో వారిని అలా విభజించి ఇలా నాలుగు రిసార్టులకు పంపారని సమాచారం. నాలుగు రిసార్టులలోనూ ఎమ్మెల్యేలపై గట్టి నిఘా ఉంది. ఎమ్మెల్యేల వద్ద నుంచి సెక్యూరిటీ ఫోన్లను తీసేసుకున్నారు. ఒకవేళ ఎవరివద్ద అయినా రహస్యంగా ఫోన్ ఉన్నప్పటికీ... అవి పని చేయకుండా జామర్లను ఏర్పాటు చేశారు. రిసార్ట్స్ ప్రాంతాలను శశికళ అనుచరులు తమ అధీనంలోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని మనసు మార్చుకునే అవకాశం కూడా లేకుండా.. వారికి చదవడానికి వార్తాపత్రికలు, చూడ్డానికి టీవీ కూడా లేకుండా చేశారిని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. బయట జరుగుతున్న పరిణామాలు ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండా శశి వర్గం జాగ్రత్త పడుతోంది. మరోవైపు, తమ ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచడాన్ని శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కొనడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తోందని... అందుకే వారిని క్యాంపుల్లో ఉంచామని చెబుతోంది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమ వర్గం ఎమ్మెల్యేలకు రక్షణ కూడా తమ బాధ్యత అని అంటున్నారు.
మరోవైపు తమ వర్గం ఎమ్మెల్యేలకు సకల సదుపాయాలు కల్పిస్తోంది శశికళ వర్గం. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, పొంగల్, దోశ, పూరీలాంటివి అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపలు, బిర్యానీ, రకరకాల కూరలు, థాలీ, డెజర్టులు తదితరాలు ఉంటున్నాయి. వీటికి తోడు మద్యం సేవించే వారి కోసం రకరకాల మద్యం అందుబాటులో ఉంది. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత ఇంత ఉన్నా... అక్కడ చీమ చిటుక్కుమన్నా శశికళ మనుషులు ప్రత్యక్షం అవుతున్నారట. దీనికి తోడు అరగంటకోసారి కాఫీలు, టీలు అంటూ అక్కడకు వెళ్లి... ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వ్యవహారం పలువురు ఎమ్మెల్యేలకు ఆగ్రహం తెప్పిస్తోందని... కొన్ని సార్లు గొడవ కూడా చేశారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more