దొంగలు పడిన అరునెలలకు.. కనిపెడతాం అని సంస్థ ప్రకటన Hitachi Payment accepts malware hit

Malware caused india s biggest debit card data breach

hitachi, hitachi payment services, reserve bank of india, rbi, rbi hitachi, debit cards hacking, India, Hitachi payment Services, Narendra Modi, demonetisation, business news

RBI ordered Hitachi Payment Services to conduct an audit of its system for a security breach that possibly compromised about 3.2 million cards issued by Indian banks in October 2016

దొంగలు పడిన అరునెలలకు.. కనిపెడతాం అని సంస్థ ప్రకటన

Posted: 02/11/2017 07:25 PM IST
Malware caused india s biggest debit card data breach

దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు అన్న నానుడిని నిజం చేస్తూ తమ అకౌంట్లలోంచి తమకు తెలియకుండానే డబ్బులు మాయమవుతున్నాయని ఖాతాదారులు పిర్యాదులతో అప్రమత్తమైన డిబిట్ కార్డులు హ్యాకింగ్ కు గురయ్యాయని అధికారులు గుర్తించారు. గతేడాది మే నెలలో హ్యాకింగ్ జరిగినా తరువాత గత అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సైబర్ అటాక్స్పై హిటాచి పేమెంట్ సర్వీసెస్ స్పందించింది. అప్పట్లో కేవలం పది లక్షల కార్డులు మాత్రమే హ్యాకింగ్ గురయ్యాయని చెప్పిన అధికారులు ఆడిట్ తరువాత ప్రస్తుతం భారత్లో 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయని హిటాచి పేమెంట్ సర్వీసెస్ ప్రకటించింది.

యస్ బ్యాంకుకు సేవలందిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అనే సంస్థ కంప్యూటర్లోకి మాల్వేర్(దొంగ సాఫ్ట్వేర్)ను పంపి వినియోగదారుల సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఈ ఏటీఎం నెట్వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల బ్యాంకు ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం మే, జూన్‌ల్లోనే జరిగినప్పటికీ తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందని వినియోగదారులు సెప్టెంబరు, అక్టోబర్లో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
600కు పైగా కస్టమర్లు ఈ హ్యాంకింగ్లో నష్టపోయారని, వారి లావాదేవీల విలువ రూ. 1.3 కోట్లు దొంగతనానికి గురైనట్టు నేషనల్  పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం మీడియాకు హ్యాకింగ్ జరిగినట్టు ధృవీకరించిన హిటాచి పేమెంట్ సర్వీసెస్, తమ భద్రతా చర్యలపై ఎప్పడికప్పుడూ సమీక్షిస్తున్నామని పేర్కొంది. ''మిడ్-2016లో మా సెక్యురిటీ సిస్టమ్స్ దొంగతనానికి గురైనట్టు ఒప్పుకుంటున్నాం. త్వరలోనే ఈ దొంగతనాన్ని కనిపెడతాం. కనిపెట్టిన వెంటనే ఆ వివరాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలకు వివరిస్తాం. తమ ఖాతారులు సెన్సిటివ్ డేటాను భద్రంగా ఉంచడానికి బ్యాంక్స్, డెబిట్ కార్డు స్కీమ్స్ను తీసుకొస్తున్నాం'' అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hitachi  rbi  debit cards hacking  India  Hitachi payment Services  demonetisation  business news  

Other Articles