వదలి వెళ్లకండీ.. ఎమ్మెల్యేలకు శశికళ ఉద్వేగ విన్నపం VK Sasikala drives to Golden Bay resort to meet party MLAs

Vk sasikala drives to golden bay resort to meet party mlas

tamil nadu, paneer selvam, sasikala, chief minister, vidyasagar rao, cabinet minister, deepa jayakumar, Golden Bay Resort, Koovathur Village residents, tamil nadu politics

Tamil Nadu Governor C Vidyasagar Rao will call on her form the next government and her supporters switching loyalties, AIADMK General Secretary VK Sasikala on Saturday met party legislators housed in a beach resort.

వదలి వెళ్లకండీ.. ఎమ్మెల్యేలకు శశికళ ఉద్వేగ విన్నపం

Posted: 02/11/2017 08:04 PM IST
Vk sasikala drives to golden bay resort to meet party mlas

తమిళనాట రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఊహించని రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ తర్వాత అమ్మగా, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న చిన్నమ్మ శశికళతో పాటు అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ వర్గంపై కూడా పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు నమోదవుతున్నాయి. తమ భర్త కనిపించడం లేదన  ఇక ఎమ్మెల్యే భార్య శశికళపై పిర్యాదు చేయగా, పన్నీరు సెల్వం నుంచి తమకు ప్రాణహాని వుందంటూ మరో ఇద్దరు శశికళ వర్గం సభ్యులు కూడా పోటీగా పిర్యాదు చేశారు. దీంతో అటు పన్నీరు కన్నా.. ఎమ్మెల్యేలందరి మద్దతు తనకే వుందన్న చెప్పకోచ్చిన చిన్నమ్మకు ఊహించని షాకులెదురవుతున్నాయి.

పన్నీర్ సెల్వంకు అనూహ్యంగా మద్దతు పెరగడంతో పాటు, ఆమెపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారిక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ వైపు దారులన్నింటిల్లో ఆంక్షలు విధించడంపై అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ ఉన్న గ్రామ దారులన్నింటిన్నీ బ్లాక్ చేస్తున్నారు. అంతేకాక రాత్రిపూట రాజకీయ తతంగమంతా నడపాలనుకుంటున్న శశికళ వర్గం చీకటిపడ్డాక ఆ దారుల్లో వెలుతురు కూడా ఉండకుండా ఉండేందుకు లైట్స్ అన్నీ స్విచ్చాఫ్‌ చేస్తున్నారు.
 
మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అతి బలవంతం మీద అక్కడ ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడి వెళ్లడం వారిని వివరణ అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో చిన్నమ్మ కూడా అక్కడికి వెళ్లింది. అసంతృప్తిగా ఉన్న ఎెమ్మెల్యేలను బుజ్జగించడానికి శశికళ  ఆ రిసార్ట్కు వెళ్లి మరీ వారిని సముదాయించారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేల వ్యవహారం శరాఘతంగా పరిణమించిన తరుణంలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న సందర్భంలో అమె ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యేలను నిర్బంధించి తనవైపు తిప్పుకుంటానన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు.

గోల్డెన్‌ బే రిసార్ట్‌లో దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 20 మంది ఎదురుతిరిగారని, వారు ఏక్షణమైనా పన్నీర్‌ సెల్వం గూటిలో చేరేందుకుసిద్ధంగా ఉన్నారని కథనాలు గుప్పమంటున్న నేపథ్యంలో శశికళ ఇక్కడికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ చాలామంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్తలను ఖండించడానికి అన్నట్టు.. రిసార్ట్‌లో శశికళ, ఎమ్మెల్యేలతో కలిసిన ఫొటోలను విడుదల చేశారు. ఇన్నీ పాట్లు పడుతున్నా చిన్నమ్మకు చివరికి సీఎం పీఠం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles