‘సుప్రీం’ తీర్పుపై శశికళ ఏమన్నారో తెలుసా..? sasikala responce on supreme court verdict

Sasikala responce on supreme court verdict

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, pallaniswamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK general secretary VK Sasikala tried to present a brave stance, after Supreme Court verdict, she said dharma will win.

‘సుప్రీం’ తీర్పుపై శశికళ ఏమన్నారో తెలుసా..?

Posted: 02/14/2017 12:11 PM IST
Sasikala responce on supreme court verdict

అక్రమాస్థుల కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు తీర్పును వెలువరించగానే స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ బోరును విలపించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో తీవ్ర ఉద్వేగానికి లోనైన అమె.. గోల్గన్ బే రిసార్టులో సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును చూసి.. తట్టుకోలేక భావోద్వేగానికి లోనైన చిన్నమ్మ శశికళ విలపించారు. ఆ తరువాత తేరుకున్న శశికళ.. తన గుండెనిబ్బరాన్ని చాటుకుంటూ ధర్మో రక్షతి రక్షితహ: అని.. ధర్మం విజయాన్ని సాధిస్తుందని అన్నారు.

గతంలో అమ్మ జయలలిత కూడా అక్రమాస్థుల కేసులో ఎదుర్కొన్న అన్ని సమస్యలను తాను అనుభవించానని, అమ్మకు ధైర్యంగా వుంటూ విజయాన్ని సాధిస్తామని చెప్పానని అన్నారు. ఈ సారి అమ్మ అశయాలు తమతో వున్నాయని, వాటితోనే తాము వాటితో ముందుకు సాగుతామని ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని శశికళ చెప్పినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ఈ కేసులో తీర్పు రావడంతో సంబంరాలు జరుపుకుంటున్న పన్నీరు సెల్వం వర్గంపై పనిలో పనిగా అమె విమర్శలు సంధించారు.

పార్టీద్రోహులు మాత్రం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కేసు తీర్పుతో అమ్మ అత్మ ఎంత క్షోభిస్తుందన్న విషయాన్ని మర్చిపోయిన నేతలు అమ్మ అత్మను అవమానపరుస్తూ సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ఎప్పటికైనా అమ్మ జయలలిత విజయం సాధిస్తారని.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది సేవపటికి అన్నాడీఎంకే వర్గాలు ట్విట్ చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  Supreme court  AIADMK  TamilNadu  

Other Articles