తన వారసుడ్ని ప్రకటించిన శశికళ.. sasikala announces aiadmk successor

Sasikala announces aiadmk successor

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, K Palanisamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK general secretary VK Sasikala selects and announces minister for roads and buildings K Palanisamy as her sucessor, who yet to meet governor vidyasagar rao.

అన్నాడీఎంకే పక్ష నేతను, వారసుడ్ని ప్రకటించిన చిన్నమ్మ

Posted: 02/14/2017 12:45 PM IST
Sasikala announces aiadmk successor

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు తీర్పు నేపథ్యంలో కారాగారవాసానికి వెళ్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. తనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిని పార్టీ పక్షనేతగా ఎంపిక చేసింది. ఆ తరువాత ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనను ముక్తకంఠంతో తమ నేతగా అంగీకరించారు. తమ వర్గం తరఫున సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును శశికళ ప్రకటించారు. రేసులో పళనిస్వామి, సెంగొట్టయ్యన్, తంబిదొరై పేర్లు తొలుత వినిపించినా.. ఆ తరువాత అనూహ్యంగా జయలలిత మేనల్లుడు దీపక్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

అయితే జయలలిత క్యాబినెట్ లో రోడ్లు భవనాలు, ఓడ రేపుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పళనిస్వామి తనకు అత్యంత నమ్మకస్తుడు కావడంతో అతడ్నే తమ అన్నాడీఎంకే పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తరువాత గోల్డన్ బే రిసార్టులలో సమావేశమైన తమ వర్గం ఎమ్మెల్యేల సమావేశంలో కూడా అయన పేరును ప్రతిపాధించి.. అందరి చేత ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పళనిస్వామి ఎడప్పాటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలుగా ఓటమి ఎరుగని నేతగా గెలుపోందడం కూడా అతని పెంపికకకు కారణం కావచ్చు.

పళనిస్వామిన అన్నాడీఎంకే పక్ష నేతగా ఎంపిక చేసిన శశికళ.. హుటాహుటిన సదరు విషయాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావుకు తెలియజేసింది. తమ ఫక్ష నేతగా పళనిస్వానికి ఎన్నుకున్నట్లు రాజభవన్ కు ఫాక్స్ ద్వారా సమాచారాన్ని అందించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయమై ముఖ్యనేతలతో చర్చలు నిర్వహించిన శశికళ.. వారికి పలు సూచనలు చేసింది. ఇక తన ప్రత్యర్థి పన్నీరుసెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  K Palanisamy  disproportionate case  Supreme court  AIADMK  TamilNadu  

Other Articles