రావుగారి ముందు 5 ఆఫ్షన్లు.. ఏం చేస్తాడో? | 5 ptions before Governor vidyasagar rao.

New governor for tamil nadu

Governor Vidyasagar Rao, Vidyasagar Rao Options, Tamil Nadu New Governor, Palanisamy Panneerselvam, Governor Vidyasagar Rao, Vidyasagar Rao Legal, Palanisamy Panneerselvam Vidyasagar Rao, Tamil Nadu Raj Bhavan

Governor Vidyasagar Rao meets teams Palanisamy, Panneerselvam. Decision on CM likely soon.

తమిళనాడుకు కొత్త గవర్నర్?

Posted: 02/16/2017 09:30 AM IST
New governor for tamil nadu

ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే. తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకున్నా మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉండటంతో అటార్నీ జనరల్ సలహాను కూడా అమలు చేసేందుకు కాస్త ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గవర్నర్ మారబోతున్నాడన్న వార్త ఒకటి బయటికి వచ్చింది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్టు కేంద్రం నుంచి స్పష్టమైన సమాచారం అందింది.

తమిళనాడు నేత, బీజేపీ జాతీయ కమిటీ కార్యదర్శి హెచ్.రాజా బుధవారం తిరుచ్చిలో మీడియాతో ఈ విషయన్ని తెలిపారు. రోశయ్య పదవీ కాలం ముగిసిన తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్ విద్యాసాగర్‌రావును తమిళనాడుకు తాత్కాలిక గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో గవర్నర్‌ను నియమించనున్నట్టు రాజా తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం, నిర్ణయాన్ని జాప్యం చేయడంపై రాజా మాట్లాడుతూ అందులోని ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించారని అన్నాడు.


ఐదు ఆఫ్షన్లు ఉన్నాయి...

క్షణానికో మలుపు తిరుగుతూ వచ్చిన తమిళ రాజకీయాలు దాదాపు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్నమ్మ జైలుకు వెళ్లటంతో గవర్నర్ విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే, ఆయన ముందు 5 ఆప్షన్లు ఉన్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

1. పళనిస్వామిని ఆహ్వానించటం... రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన పళనీ, తనకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలముందని చెబుతూ లేఖ ఇచ్చాడు. అయితే, ఆయన సమర్పించిన లేఖపై గవర్నర్ సంతృప్తి చెందాల్సి వుంటుంది.

2. పన్నీర్ కు బలనిరూపణ అవకాశం... అవకాశం ఇస్తే సభలోనే తన బలాన్ని నిరూపించుకుంటానని చెబుతున్న ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వడం. ఎమ్మెల్యేలను రిసార్టులో బంధించి వుంచి బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారన్నది సెల్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. సీఎంగా రాజీనామా చేసినప్పటికీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నందున గవర్నర్ తన విశేషాధికారాలతో పన్నీర్ ను బల నిరూపణకు ఆహ్వానించవచ్చు.

3. కాంపోజిట్ బలపరీక్ష... తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి కాంపోజిట్ బలపరీక్షకు ఆదేశించడం. ఇదే జరిగితే, పళనిస్వామి, పన్నీర్ సెల్వంల బలం అందరి ముందూ తేలిపోయి, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఎవరిదన్నది స్పష్టమైపోతుంది. సభకు హాజరైన ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. మూజువాణీ ఓటింగ్ లేదా డివిజన్ ఓట్ ద్వారా విజేతను నిర్ణయించవచ్చు. డివిజన్‌ ఓట్‌ కోరితే, బ్యాలెట్‌ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తే, స్పీకర్‌ ఓటు వేసి విజేతను నిర్ణయిస్తారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ లో కళ్యాణ్‌ సింగ్, జగదాంబికా పాల్‌ లు ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీ పడినవేళ కాంపోజిట్‌ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాన్ని గుర్తు చేస్తున్న నిపుణులు, తమిళనాడులో సైతం ఇదే పద్ధతి అవలంబించాలని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ గవర్నర్‌ కు సూచించినట్టు తెలుస్తోంది.

4. డీఎంకే కు ఛాన్స్... అన్నాడీఎంకే సభ్యులు చీలిపోయి ఎవరికీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో 89 మంది ఎమ్మెల్యేలతో ప్రస్తుతం రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న డీఎంకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వడం. ఇదే జరగాలంటే, పన్నీర్ సెల్వం తన మద్దతు ఎమ్మెల్యేలంతా డీఎంకే వెనకే ఉన్నామని లేఖ ఇవ్వాల్సి ఉంటుంది.

5. రాష్ట్రపతి పాలన... ఇక గవర్నర్ విద్యాసాగర్ ముందున్న ఆఖరి ఆప్షన్, అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, రాష్ట్రపతి పాలన విధించడం. ఎవరికీ మెజారిటీ లేదని ఆయన భావించి, అసెంబ్లీలో కూడా అదే తేలిన తరువాతే ఈ అంశం తెరపైకి వస్తుంది. మరికాసేపట్లో దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Governor  Ch Vidyasagar Rao  Raj Bhavan  

Other Articles