పెళ్లంటేనే చుట్టాలు, స్నేహితుల కోలాహలం, పందిళ్లు, భోజనాలు ఇలా సందడి సందడిగా ఉండటం కామన్. జీవితంలో ఒకేసారి జరుపుకునే ఈ వేడుకునే అంగ రంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఇక పై అలాంటి వాటికి చెక్ పడే పరిస్థితులు రాబోతున్నాయి. వివాహ సమయాల్లో పెరిగిపోతున్న దుబారా ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం ఓ సరికొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది. అందుకోసం ఓ ప్రత్యేక చట్టం తీసుకురాబోతుంది కూడా.
ఇక నుంచి పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటితే అందులో పదిశాతం ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీ రంజిత రంజన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాహ బిల్లు-2016లో ఈ మేరకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడంతోపాటు, వృథా ఖర్చును తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రవేటు బిల్లుగా పరిగణించి వచ్చే లోక్‌సభ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వివాహబిల్లు ప్రకారం పెళ్లిలో రూ. 5 లక్షలకు మించి ఖర్చు చేయాలనుకునే వారు ముందుగా సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఖర్చు చేయాలనుకున్న మొత్తంలో పదిశాతాన్ని ముందుగానే ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వ ఖజానాకు ఇలా సమకూరే మొత్తాన్ని సంక్షేమ నిధికి మళ్లిస్తారు.
ఈ సొమ్మును పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఖర్చు చేస్తారు. ఇక పెళ్లి భోజనాల్లోనూ వృథా తగ్గించేందుకు బిల్లులో ప్రతిపాదన చేశారు. పెళ్లిలో కొత్త పోకడల కారణంగా వృథా ఖర్చులు పెరిగిపోతున్నాయని, ఇది పేదలకు మరింత భారంగా మారుతోందని రంజిత రంజన్ పేర్కొన్నారు. పెరిగిపోతున్న ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉందని, పెళ్లి జరిగిన రెండు నెలల్లోగా రిజస్టర్ చేయించాలని ఆమె తెలిపారు. ఇంతకీ ఈవిడగారు ఎవరో కాదు వివాదాస్పద ఎంపీ పప్పు యాదవ్ సతీమణి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more