కాంక్రీట్ జంగిల్ లోకి కారడవుల్లోని అతిథి Leopard strays into Palwal residential area, caught

Wildlife officials rescue leopard trapped in residential area

Leopard scare, Leopard attack, Haryana, Paliwal, Wildlife department, Big cat, leopard in village, forest officials, india

A wildlife guard was injured in the process of rescuing the big cat. The animal was finally caught with the help of a net and will be released into the wild after it is declared medically fit.

కాంక్రీట్ జంగిల్ లోకి కారడవుల్లోని అతిథి

Posted: 02/17/2017 04:31 PM IST
Wildlife officials rescue leopard trapped in residential area

కారడవుల్లో సంచరించాల్సిన వన్యప్రాణి నేరుగా కాంట్రకీట్ జంగిల్ లోకి వచ్చేసింది. దారి తప్పిందో.. లేక క్షుద్భాధను తీర్చుకుందామనుకుందో తెలియదు కానీ హరియాణాలోని పల్వాల్ గ్రామం కృష్ణా కాలనీవాసులను ఉదయాన్నే పలకరించింది. ఉదయం 7-8 గంటల సమయంలో వచ్చిన అనుకోని అతిధి ఏకంగా ఆరు నుంచి ఏడు గంటల పాటు హంగామా చేసింది. అయితే అతిధిని చూడటానికి వచ్చిన స్థానికులు భయం భయంగానే అక్కడికి చేరకున్నా.. పెద్దసంఖ్యలోనే గుమ్మిగూడారు.

విషయంలోకి ఎంటరైతే.. మూడు నాలుగేళ్ల వయసున్న మగ చిరుతపులి ఒకటి గ్రామం మొత్తం తన ఇష్టం వచ్చినట్లు తిరిగేసింది. దాదాపు ఆరు గంటల పాటు అది ఊళ్లో ఏవేం ఉన్నాయో అన్నీ చూసుకుంది. ఆ తర్వాత ఎట్టకేలకు అటవీ శాఖాధికారులు దాన్ని పట్టుకోగలిగారు. వాళ్లు దాన్ని ఎలా పట్టుకుంటున్నారో చూసేందుకు దాదాపు వెయ్యి మందికి పైగా జనం గుమిగూడారు. చాలామంది తమ పిల్లలను కూడా తీసుకొచ్చి మరీ ఆ చిరుతను చూపించారు.
 
మూడునెలల క్రితం మాండవార్‌లో మాత్రం పోలీసులు, అటవీ శాఖాధికారులు కలిసి కూడా చిరుతను పట్టుకోలేకపోవడంతో గ్రామస్థులే దాన్ని పట్టుకుని కొట్టి చంపేవారు. ఈసారి మాత్రం అలా జరగకుండా.. అత్యంత జాగ్రత్తగా చిరుతను అధికారులు పట్టుకున్నారు. కృష్ణకాలనీలోని పార్కులో కొంతమంది ముందుగా దీన్ని చూశారు. వెంటనే వాళ్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈలోపు అది పార్కు నుంచి ఒక ఖాళీ ఇంట్లోకి దూరింది.

కాసేపటికి ఆ ఇల్లు నచ్చలేదో ఏమో.. మళ్లీ పార్కుకు వచ్చేసింది. దాంతో అటవీ శాఖాధికారులకు పని సులువైంది. పార్కులోకి చేరుకున్న చిరుతకు మత్తుమందు ఇచ్చి, పట్టుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పల్వాల్, గుర్‌గావ్, ఫరీదాబాద్ అటవీశాఖాధికారులు అంతా కలిసి దాన్ని పట్టుకున్నారని గుర్‌గావ్ డీఎఫ్‌ఓ శ్యామ్ సుందర్ చెప్పారు. దాన్ని 12 గంటల పాటు పరిశీలించి, ఆ తర్వాత అడవుల్లోకి వదిలిపెడతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  palwal village  leopard in village  forest officials  haryana  india  

Other Articles