వార్నీ.. టెంపరరీకే అన్ని వందల కోట్లా? AP temporary assembly details by CRDA

Do you how much spent to ap temporary assembly

Andhra Pradesh speaker Kodela Sivaprasad, Amaravati New Assembly, AP Temporary Assembly, Velagapudi Assembly, AP New Assembly Hall, Speaker Kodela New Assembly, AP Assembly Shifted, Capital Region Development Authority Report

Andhra Pradesh speaker Kodela Sivaprasad officially announced Assembly shifts to Amaravati. Capital Region Development Authority reported 700 crores for temporary buildings.

ఏపీ తాత్కాలిక అసెంబ్లీ ఖర్చు ఎంతంటే...

Posted: 02/20/2017 10:31 AM IST
Do you how much spent to ap temporary assembly

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మించిన కొత్త అసెంబ్లీ హాల్‌ వివరాలను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ప్రకటించింది. మొత్తం 231 సీట్లు, మండలిలో 90 సీట్లు కెపాసిటీతో దానిని ఏర్పాటు చేసినట్టు సీఆర్‌డీఏ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రూ.515 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆరు భవనాల సివిల్ పనులకు దాదాపు రూ.715 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. అలాగే మౌలిక వసతులు, ఫర్నిచర్, ఆడియో, వీడియో వ్యవస్థ, లైటింగ్, ఏసీ, కాన్ఫరెన్స్ హాళ్ల కోసం చేసిన ఖర్చులను వివరంగా తెలిపింది.

ఆరు భవనాల్లోనే పబ్లిక్ అడ్రస్ వ్యవస్థతోపాటు సీఎం భవనం నుంచి అన్ని భవనాలకు స్పీకర్ల ద్వారా ఒకేసారి సందేశం పంపే ఏర్పాటు చేసినట్టు తెలియజేసింది. నిర్మాణం సమయంలో రోజుకు సగటున 2,400 మంది కార్మికులు, 130 మంది ఇంజినీర్లు పనిచేసినట్టు సీఆర్‌డీఏ కార్యాలయం పేర్కొంది. సివిల్‌ పనుల కోసం రూ.200.98 కోట్లు, విద్యుత్, ఏసీ, ఫర్నీచర్‌ వంటి పనుల కు రూ.314.21 కోట్లు వినియోగించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1, 2 భవనాల నిర్మాణానికి రూ.67.02 కోట్లు, 3, 4 భవనాల నిర్మాణానికి రూ.66.98 కోట్లు, 5, 6 భవనాల నిర్మాణానికి రూ.66.98 కోట్లు వినియోగించినట్లు తెలిపింది.

భవన సముదాయంలో మౌలిక వసతులకు రూ.113.38 కోట్లు, 1, 2 భవనాల్లో ఎలక్ట్రికల్, లైటింగ్, ఏసీ, ఫర్నీచర్, ఆడియో, వీడియో వ్యవస్థ, బీఎంఎస్, ఐబీఎంఎస్, కాన్ఫరెన్స్‌ హాల్‌ కోసం రూ.66.15 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. 3, 4, 5, 6 భవనాల్లో ఇవే పనులకు రూ.134.68 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఆరు భవనాల్లోనూ పబ్లిక్‌ అడ్రస్‌ వ్యవస్థ ఉంటుందని, ముఖ్యమంత్రి భవనం నుంచి అన్ని భవనాలకు స్పీకర్ల ద్వారా ఒకేసారి సందేశం పంపే ఏర్పాటు ఉన్నట్లు తెలిపింది. భవన సముదాయంలో అంతర్గత రోడ్లు, విద్యుత్‌ సబ్‌స్టేషన్, ఎక్స్‌టర్నల్‌ లైటింగ్, 12 కిలోమీటర్ల నీటి పైపులైను, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్‌ సెక్యూరిటీ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు వివరించింది.

ఇక మార్చి 3 నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాలు కొత్త అసెంబ్లీ భవనంలోనే ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆదివారం భాగ్యనగరానికి వీడ్కోటు చెబుతున్నాట్లు ప్రెస్ మీట్ లో ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. హైదరాబాద్‌ను వదిలి వెళ్లాల్సి రావడం బాధగా ఉందన్నారు. ఎవరెవరం ఎక్కడ ఉన్నా ఇకముందు కూడా ఇవే సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. నూతన శాసనసభ, శాసనమండలి భవనాల్లో అన్ని పార్టీలకు ఎటువంటి వివక్షా లేకుండా కేటాయింపులు జరిపినట్టు కోడెల వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Capital Region Development Authority  Temporary Assembly  Amaravati  

Other Articles