అసలు మీ ఏటీఎం నుంచి ఎంత డ్రా చేసుకోవచ్చు? Weekly cash withdrawal limit for saving accounts

Cash withdrawal limit exceed on savings account

Savings Account withdrawal limit, Cash withdrawal limit, RBI withdrawal limit, withdrawal limit 50K, Savings Account Holders, RBI March 13th, RBI Cash withdrawal

Another relaxtion from Reserve Bank of India. Now Weekly cash withdrawal limit exceed for 50, 000 Rupees for Savings Account Holders.

కొత్త నోట్లు.. మరో ఊరట!

Posted: 02/20/2017 10:55 AM IST
Cash withdrawal limit exceed on savings account

నోట్ల రద్దు తర్వాత దశలవారీగా వినియోగదారులకు ఊరటనిస్తూ వస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ఉపశమనం ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాదారులు ఇకపై వారానికి 50 వేలు విత్ డ్రా చేసుకునే వెసులు బాటు కల్పించింది. అంతేకాదు సోమవారం నుంచే సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.

కాగా, ఈ పరిమితి ఇంతకు ముందు 24,000 గా ఉన్న విషయం తెలిసిందే. జనవరి 30న జారీ చేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రా లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి సేవింగ్స్ ఖాతాదారులు వారానికి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు విత్ డ్రాపై పరిమితులను ఎప్పుడో ఎత్తివేసింది కూడా.

మరోవైపు బ్యాంకులన్నీ ఏటీఎం విత్ డ్రాల పై పరిమితుల తర్వాత ఛార్జీలు వసూలు చేస్తుండగా, ఒక్క సెంట్రల్ బ్యాంకు మాత్రం మరికొన్ని రోజులు దానిని కొనసాగించాలని నిర్ణయించుకుంది. వచ్చే నెల 13 నుంచి అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

 

సంబంధిత కథనాలు చదవండి... 

 

నోట్ల రద్దు ఆర్డినెన్స్ లో ఏముంది?

 

క్యాష్ విత్ డ్రా... ఇదేం ట్విస్టు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Cash withdrawal  Exceed  

Other Articles