ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగిలింది. ఆయన ఆస్తుల స్వాధీన పర్వం కొనసాగుతోంది. ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం తాకట్టు పెట్టిన మరో రెండు స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం బ్యాంకు అధికారులు ఓ ఇంగ్లిష్ పేపర్లో ఆస్తుల స్వాధీన ప్రకటన జారీ కూడా చేశారు. మంత్రి బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న ‘ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం 2005లో విశాఖపట్టణంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.141.68 కోట్ల రుణం తీసుకున్నారు.
సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అది వడ్డీతో కలిపి రూ.196 కోట్లు అయింది. తీసుకున్న రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు పలుమార్లు కంపెనీకి నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రత్యూష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్లకు చెందిన ఆస్తులతోపాటు రుణం కోసం హామీదారులుగా ఉన్న మంత్రి గంటా, కంపెనీ డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నామి అమూల్యల ఆస్తులను గత డిసెంబరులోనే బ్యాంకు స్వాధీనం చేసుకుంది.
మిగిలిన బకాయిలను చెల్లించేందుకు రెండు నెలల గడువు ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో మరోమారు ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం పెరిగిన వడ్డీతో కలిపి మొత్తం రూ.203.62 కోట్లు బకాయి పడినట్టు బుధవారం బ్యాంకు జారీ చేసిన పొజిషన్ నోటీసులో పేర్కొంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్ టౌన్ పరిధిలోని షోలింగనల్లూర్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్ గ్రామాల్లో ఉన్న ఆస్తులను ఈనెల 16, 17 తేదీల్లో స్వాధీనం చేసుకున్నట్టు బ్యాంకు పేర్కొంది. కాగా, కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా ఇలాంటి వ్యవహారంలో ఉండటం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more