వాజ్ పేయిపై విష ప్రయోగం.. పిచ్చ లైటు లాలూ | Union ministers rejecting Lalu’s demand on Vajpayee condition.

Lalu prasad yadav sensational comments on vajpayee health

Lalu Prasad Yadav Atal Bihari Vajpayee, Atal Bihari Vajpayee Health, Atal Bihari Vajpayee Intoxicant, Radha Mohan Singh Lalu, Lalu Vajpayee, Vajpayee Health, Vajpayee Lalu Prasad Yadav, Lalu Shocking Comments

RJD Chief Lalu Prasad Yadav’s demand for probe into Atal Bihari Vajpayee’s health. He alleges that Vajpayee has been put on intoxicants and sidelined from politics. Later Union Ministers Radha Mohan Singh and Uma Bharathi dismissed that allegation.

వాజ్ పేయిపై విష ప్రయోగం జరిగింది

Posted: 02/23/2017 04:07 PM IST
Lalu prasad yadav sensational comments on vajpayee health

భారతీయ జనతా పార్టీ కురువృద్దుడు, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఎంతో కాలంగా ఎవ్వ‌రికీ క‌నిపించకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. కనీసం మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడనే ఆ మధ్య చెప్పుకున్నాం కూడా. పుట్టినరోజు సందర్భంగా, చివరకు ఆయ‌న‌కు భార‌త్ ర‌త్న అందించే సమయంలో కూడా ఓ ఫోటోనో, లేక వీడియో లాంటిదాన్నో కూడా విడుదల చేయలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొందరు బీజేపీ నేతలు వాజ్‌పేయికి విషం ఇచ్చి ఆయనను రాజకీయాలకు దూరం చేశారని కామెంట్లు చేశాడు. ఆయనకు ఏదో మందుపెట్టారు.. అప్పటి నుంచే ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుత రాజకీయాలు ఏం అర్థం కాని పరిస్థితి ఆయనది అంటూ తెలిపాడు. అంతేకాదు ఆయ‌న‌ ఆరోగ్యంపై విచారణ జరపాలని డిమాండ్ కూడా చేశాడు.

ఇక దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాథామోహన్ సింగ్ మండిప‌డ్డాడు. ప్రస్తుతం లాలూ వ్యాఖ్యలను ఎవరూ ప‌ట్టించుకునే పరిస్థితిలో లేరు. అంతెందుకు లాలూ తో సన్నిహితంగా ఉండే బీహార్‌ సీఎం నితీష్ కుమార్‌ కూడా ఆ వ్యాఖ్య‌ల‌ను పట్టించుకోడని ఆయ‌న తెలిపాడు. మరోపక్క కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి లాలూ వ్యాఖ్యలను హస్యాస్పదంగా పేర్కొంది. వాజ్ పేయి ఇంటికి వెళ్లి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను కలిస్తే లాలూ అనుమానాలు తీరవచ్చని ఆమె సలహా ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee  Health  Lalu Prasad Yadav  BJP Leaders  

Other Articles