మళయాళ నటి భావన అపహారణ, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునిని కొచ్చిలోని జిల్లాకోర్టు ప్రాంగణంలో హై డ్రామా మధ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ భారత చలనచిత్రాలలో నటించిన ప్రముఖ నటిని పాత కక్షల నేపథ్యంలో కిడ్నాప్ చేసి, మరికోందరు నిందితులతో కలసి అత్యంత దారుణానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నేరస్థుడైన సునీల్.. సరిగ్గా నటిని అపహరణకు వేసిన మాదిరిగానే ఇక స్కెచ్ ప్రకారం పోలీసుల కళ్లు గప్పి ఏకంగా న్యాయస్థానంలోనే లొంగిపోయేందుకు వచ్చాడు.
అయితే అతని స్కెచ్ ఇక్కడ కూడా సఫలీకృతం అయ్యేదే కానీ పోలీసులు సరైన సమయంలో సరిగ్గా స్పందించడంతో బెడిసికొట్టింది. అతనితో పాటు వున్న మరో నిందితుడు విగేష్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా వారం రోజుల పాటు అక్కడా ఇక్కడ ఎక్కడెక్కడో తలదాచుకున్న సునీల్ పోలీసు కస్టడీకి వెళ్లకుండా ఏకంగా కోర్టులో లొంగిపోవాలని భావించాడు. అందుకు చక్కగా స్కెచ్ కూడా వేసుకున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో మరో నిందితుడైన విగీష్‌తో కలిసి లొంగిపోయేందుకు సునీ ఏసీజేఎం కోర్టుకు వచ్చాడు.
ఆ సమయంలో మేజిస్ట్రేట్ భోజనానికి వెళ్లిడంతో అతని ప్రణాళిక బెడిసికోట్టింది. అయితే బోనెక్కిన తనను పోలీసులు అదుపులోకి తీసుకోరన్న ధైర్యంతో వుండగా, ఒక్కసారిగా పోలీసులు లోపలకు దూసుకొచ్చి.. బోనులో వున్న పల్సర్ సుని, విగీష్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ కుర్చీ ఖాళీగా ఉండటంతో పోలీసుల పని సులువైంది. అయితే పోలీసుల అదుపులోకి తీసుకుంటామంటే రానని మెండికేసిన సునిని పట్టుకుని లాగేశారు. అతడు వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో సునీ కింద పడిపోగా.. పోలీసులు అతడిని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి కోర్టు బయట ఉన్న వ్యానులోకి తోశారు. పోలీసుల ప్రవర్తన పట్ల న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు హంతకుడు కావచ్చు, రేపిస్టు కావచ్చు గానీ.. కోర్టుకు మాత్రం అతడిపై నేరం రుజువయ్యేవరకు కేవలం నిందితుడు మాత్రమేనని, కోర్టు నుంచి నిందితులను లాక్కెళ్లే హక్కు పోలీసులకు లేదని న్యాయవాదులు అన్నారు. ఇప్పుడు సుని, విగీష్‌లను అలువాలోని పోలీసు క్లబ్ వద్ద ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more