అమెరికాలో జాత్యహంకార దుండగుడు జరిపిన కాల్పుల్లో భారతీయ ఇంజనీర్ మృతి చెందడం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతి వివక్ష నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో తెలుగు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ కూచిబొట్ల మృతిపట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని అవేదన వ్యక్తం చేశారు. అతడి కుటుంబం ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన అలోక్ మాదసాని ఆస్పత్రి నుంచి ఇంకా డిశ్చార్జి అవ్వాల్సి ఉందని అక్కడి భారత రాయబారి తెలిపినట్లు సుష్మా చెప్పారు.
గాయపడిన అలోక్‌కు సహాయం చేసేందుకు కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హర్పాల్ సింగ్ కాన్సాస్కు బయలుదేరినట్లు తెలిపారు. ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నానని, శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో జాతి వివక్ష నెత్తికెక్కిన ఓ తెల్లజాతి దుండగుడు ఓ బార్లో వున్న తెలుగు ఇంజనీర్లపై కాల్పులకు తెగబడ్డాడు. కాగా ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా, మరో ఇంజనీరుకు అలోక్ గాయపడ్డాడు. వీరిద్దరూ గార్నిమ్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలోక్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జేఎన్టీయూలో డిగ్రీ చదివిన శ్రీనివాస్ అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అలోక్ హైదరాబాద్‌లోని వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసి కన్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ కాల్పుల్లో ఇయాన్ గ్రిల్లట్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. ‘మా దేశం నుంచి వెళ్లిపోండి..’ ‘ఉగ్రవాదులారా.. ’ అంటూ జాత్యహంకార వ్యాఖ్యలతో దుండగుడు దూషించాడు. దీంతో బార్ యాజమాన్యం కలుగజేసుకొని అతడిని బయటకు పంపింది. కాసేపటికే అతడు తిరిగి వచ్చి తుపాకీతో వీరిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఘటనకు సంబంధించి ఆడమ్ పూరింటన్ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more