పన్నీరుకు కన్నీరు.. దీపా కొత్త పార్టీ.. అమ్మ దీపా పెరవై Jayalalithaa's niece Deepa Jayakumar launches political forum

Jayalalithaa s niece deepa jayakumar launches political forum

tamil nadu, sasikala, jayalalithaa, Jayalalithaa niece, Amma Deepa Peravai,Deepa jayakumar, Deepak jayakumar, poyes Garden, palnisamy, legal heirs, paneer selvam, sasikala, chief minister, DMK, mk stalin, tamil nadu politics

Deepa Jayakumar, the niece of late Tamil Nadu chief minister J Jayalalithaa, announced a new party on Friday, making her political debut with a vow to “remove all traitors from the AIADMK”.

పన్నీరు పక్కన కాదు.. అమ్మ దీపా పెరవైతోనే దీపా.. కొత్త పార్టీ లాంఛ్

Posted: 02/24/2017 06:52 PM IST
Jayalalithaa s niece deepa jayakumar launches political forum

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్టుగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కొత్త పార్టీని ప్రారంభించారు. దీనికి ఎంజీఆర్ అమ్మ దీప పెరవై పేరు పెట్టారు. జయలలిత 69వ జయంతి సందర్భంగా దీప ఈ ప్రకటన చేస్తూ.. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో కలసి పనిచేయనని చెప్పారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. జయలలితకు తానే అసలైన వారసురాలినని చెప్పారు.

శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా జయలలిత అభిమానులు తనను కోరుతున్నారని చెప్పారు. పళనిస్వామి ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రికాదని విమర్శించారు.దీపా పేరవై వర్గాలు ఏకంగా పన్నీరు శిబిరం మీద విమర్శలు గుప్పించే పనిలో పడ్డ నేపథ్యంలో గురువారం టీనగర్‌లో కొత్త జెండాలు ప్రత్యక్షం అయ్యాయి.  దీపా ఇంటి పరిసరాల్లో ఈ జెండాలు హోరెత్తడంతో పన్నీరుతో కలిసి అడుగులు వేయకుండా, మేనత్త చరిష్మాతో ఒంటరిగానే ముందుకు సాగేందుకు ఆమె నిర్ణయించుకున్నారని స్పష్టంమైంది.

కాగా, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మళ్లీ తమ పార్టీని తిరిగి వెనక్కి తెచ్చుకుంటామని వాగ్దానం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత బయటికి గెంటివేయబడ్డ కుటుంబం ఇప్పుడు అన్నాడీఎంకేలో చక్రాలు తిప్పుతుందని, వారి చేతుల్లోంచి పార్టీని బయటపడేస్తానని పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలిత మరణం గురించి అందరిలో ఓ అనుమానం ఉందని, ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి ప్రతిఒక్కరూ అడుగుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆమె మరణం గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles