ప్రధాని వ్యాఖ్యలు అవమానకరం.. ఇదేనా అయన ప్రచారం PM Modi's Odisha poverty remark irks BJD, Congress

Pm modi s odisha poverty remark irks bjd congress

narendra modi, modi, pm modi, pm modi odisha poverty, pm modi odisha, odisha poverty, BJD MLAs protest, Congress, poverty in odisha, bjd, odisha bjd, india news

PM Narendra Modi’s remark that Odisha is a poverty-stricken state has drawn protest from the Biju Janata Dal and the Congress.

ప్రధాని వ్యాఖ్యలు అవమానకరం.. ఇదేనా అయన ప్రచారం

Posted: 02/25/2017 11:53 AM IST
Pm modi s odisha poverty remark irks bjd congress

ఒడిశాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. ఒడిశాను కించపరుస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు, దేశానికి ప్రధానిగా కోనసాగుతూ.. తన స్థాయిని దిగజార్చుకుంటూ వ్యాఖ్యలు చేయడాన్ని పక్కన బెడితే. తమ రాష్ట్ర పరువును తీస్తున్నారని మండిపడ్డారు. ప్రధానికి అన్నిఎన్నికల ప్రచారాంశాలుగానే మారాయని, మరి అభివృద్ది మాత్రం ముందుకు సాగడం లేదని దుయ్యబట్టారు. శాసనసభ్యుల ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

ఇటీవల ఒడిశాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టడాన్ని ప్రశంసిస్తూ.. దేశంలోని నిరుపేద జిల్లాలు ఎక్కడున్నాయని వెతికితే ఒడిశాలో కనిపిస్తాయని, ఒడిశాలోని పేదలు బీజేపీకి మద్దతునిస్తే.. ఇతర పార్టీలు కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అయితే, ప్రధాని మోదీ వ్యాఖ్యలను అధికార బీజేడీ, కాంగ్రెస్‌ తప్పుబట్టాయి. నిరుపేద రాష్ట్రమంటూ ఒడిశాను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కాబట్టి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm modi odisha  odisha poverty  BJD MLAs protest  Congress  poverty in odisha  bjd  odisha bjd  india news  

Other Articles