కన్హాస్ కాల్పుల ఘటనపై వైట్ హౌస్ స్పందన, నిలదీసిన హిల్లరీ White House says Kansas shooting report disturbing

White house says kansas shooting report disturbing

United States of America, white house, hillary clinton, Srinivas dead body, sunayana, alok madasani, alok madasani speaks, olathe shooting, Ian Grillot, austins shooting, interview, shooting, hate crime, adam purinton

Spicer also condemned the alleged hate crimes against the Jewish community and asserted that there is no space for violence based on religion and ethnicity

కన్హాస్ కాల్పుల ఘటనపై వైట్ హౌస్ స్పందన, నిలదీసిన హిల్లరీ

Posted: 02/28/2017 01:49 PM IST
White house says kansas shooting report disturbing

శ్రీనివాస్ కూచిబోట్ల హత్యోదంతంపై అగ్రరాజ్య శ్వేతసౌధం స్పందించింది. కన్హాస్ లో కాల్పుల ఘటన జరిగిన వారం రోజుల తరువాత.. వైట్ హౌస్ ఈ ఘటనపై తమ విచారాన్ని వ్యక్తం చేసింది. కన్హాస్ లోని అస్టిన్ బార్ అండ్ గ్రిల్ లో జరిగిన ఘటన తమను కలచివేసిందని వైట్ హౌజ్ వర్గాలు చెప్పుకోచ్చాయి. ప్రతీ పౌరుడి హక్కులను కాపాడాలన్న తమ ప్రథమ విధికి తాము కట్టుబడి వున్నామని ఓ ప్రకటనలో పేర్కోంది. జాతి, మతం ఆధారంగా అమెరికాలో హింసకు తావులేదని స్పష్టం చేసింది.తెలిపింది. ఏ పౌరుడైనా ఏ మత ధర్మానైనా స్వేచ్ఛగా పాటించవచ్చునని తేల్చిచెప్పింది.

అంతకుముందు భారత ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై డిఫీటెడ్ అమెరికన్ ప్రెసిడెంట్ హిల్లరీ క్లింటన్ అమెరికాలో పెరిగిపోతున్న 'జాతివిద్వేష నేరాల'పై ట్రంప్ మాట్లాడాల్సిందేనని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ''దేశంలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని అందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు.
 
తన భర్తపై కాల్పులు జరపడంతో అయన ప్రాణాలు పోయాయని దీనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం సమాధానిం చెబుతారని మృతుడు శ్రీనివాస్ భార్య సునయన ప్రేస్ మీట్ సందర్భంగా అడిగిన ప్రశ్నించిన తాలుగు పేపర్ క్లిపింగ్ లను కూడా హిల్లరీ క్లింటన్ తన ట్విట్ లో జతచేశారు. అమెరికాలో భారతీయుల భద్రతను ఆమె సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్లపై కాల్పుల తర్వాత ఒక్కసారిగా అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష దాడులు, ఇతర నేరాలపై చర్చ పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivas Kuchibhotla  Alok Madasani  Ian Grillot  olathe shooting  white house  hillary clinton  

Other Articles