బెడిసికొట్టిన స్వలింగ సహజీవనం.. ఆన్‌లైన్‌లో నగ్నఫొటో..! Mumbai woman sues ex, for posting nude photos online

Woman takes ex girlfriend to court for posting her nude photo online

facebook, fir, mumbai police, nude photo, social media, whatsapp, nude pics of girlfriend, Woman takes ex-girlfriend to court, posting her nude photo online, Navghar, mumbai news, maharastra news, cyber crime, crime news

A 45-year-old woman in the city has filed a case against her former live- in girlfriend, also 45, for uploading a nude picture of her on social media.

బెడిసికొట్టిన స్వలింగ సహజీవనం.. ఆన్‌లైన్‌లో నగ్నఫొటో..!

Posted: 02/28/2017 03:01 PM IST
Woman takes ex girlfriend to court for posting her nude photo online

భారతీయ వివాహబంధానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది. అది ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదర్చిన వివాహమైనా భార్యభర్తలైన తరువాత వారు ఒకరికోకరు రాజీ పడుతూ.. నూరేళ్ల తమ సంసార జీవితాన్ని అటుపోట్ల మధ్య, ఆనందాల, సుఖ సంతోషాల మధ్య గడిపేస్తూ వుంటారు. ఈ మధ్యకాలంలో కొంత విపరీతం పెచ్చురిల్లి స్వలింగ సంపర్కుల సంఖ్య కూడా పెరుగుతుంది. వారు కూడా వివాహాలు చేసుకోవడం, లేదా సహజీవనాలు చేసేయడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అయితే భార్యభర్తల మధ్య వచ్చే సమస్యలు ఇష్టపడి మనువాడిన స్వలింగ సంపర్కుల మధ్య కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

నలబై ఐదేళ్ల వయస్సు వున్న ఇద్దరు మహిళలు.. గతంలో పదేళ్ల పాటు ఇద్దరూ కలసి సహజీవనం చేశారు. కానీ ఇప్పుడు విడిపోయారు. ఆ తర్వాత వాళ్లలో ఒక మహిళ మరొకరి నగ్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అన్ లైన్లో తన నగ్నఫోటోలు పెట్టడంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ నేరానికి పాల్పడిన మహిళకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఇద్దరు మహిళలూ ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలోని పాథాలజీ విభాగంలో పనిచేసేవారు.

దాదాపు దశాబ్దం పాటు ఇద్దరి మధ్య సంబంధం ఉండేది. ఇలాంటి కేసు తమ వద్ద నమోదు కావడం ఇదే మొదటిసారిన ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరిలో ఒక మహిళకు ముందే పెళ్లయిందని, అయితే భర్తతో విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ దగ్గరయ్యారని చెప్పారు. ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత.. గత రెండేళ్లుగా ఆమె ఫేస్‌బుక్ పేజీ ద్వారా తన నగ్న ఫొటోలను పంపుతున్నట్లు బాధితురాలు గుర్తించారు.
 
చివరకు ఆమె వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా తన నగ్నఫొటోలే వాడుతున్నట్లు గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించారు. దానిపై తాను ఆమెతో గొడవ పడ్డానని, అయితే దానికి బాత్రూంలో ఉన్నప్పుడు ఆ ఫొటోలు తీసుకున్నట్లు చెప్పిందని అన్నారు. దానిపై ఇద్దరి మధ్య గొడవ అయ్యిందని, ఆ తర్వాత ఆమె తన ఫొటోలను అందరికీ పంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇంత చేసినా తాను ఎలాంటి నేరం చేయలేదనే చెబుతోందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి నాలుగున పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు తీసుకెళ్లగా, అక్కడ నిందితురాలికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude photos  ex girlfriend  two women live together  mumbai  maharastra  cyber crime  crime  

Other Articles