సెల్వంను కలిసిన పవర్ ఫుల్ సాధువు... అమ్మ ఆత్మ ఫైనల్ గా ఏం చెప్పిందంటే... | Priest about Jayalalithaa Soul.

Jayalalithaa soul talk to priest

Jayalalithaa Soul, Priest Jayalalithaa Soul, Jayalalithaa Soul Panneerselvam, Priest meet Panneerselvam, Amma Soul Priest, Priest Jayalalithaa, Amma Soul Again, Jayalalithaa Panneerselvam, Panneerselvam Deepa Jayakumar

Priest Sri Maharishi meets O Panneerselvam says that Jayalalithaa's soul talk to him. Amma's wish was selvam along with Deepa protect Tamil Nadu People and AIADMK from Sasikala.

ఫైనల్ గా అమ్మ ఆత్మ ఏం చెప్పిందంటే...

Posted: 03/01/2017 07:58 AM IST
Jayalalithaa soul talk to priest

జయలలిత మరణానంతరం ఆత్మ ఆ నేలపైనే తిరుగుతుందని, పైగా సమాధి వద్దే ఉందని ఆధారాలతో నిరూపిస్తూ కొంత మంది ఫోటోలను, వీడియోలను రిలీజ్ చేశారు. ఫోటో షాప్ జిమ్మిక్కు అని క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ వీరభక్తులు మాత్రం అది నిజమేనంటూ పూజలు చేయటం ప్రారంభించారు. అంతలోనే ఆత్మ తనకు కలలో కనిపించి అధికారం చేపట్టమని ఆదేశించిందంటూ పన్నీర్ సెల్వం పెద్ద తిరుగుబాటునే లేవదీసి చిన్నమ్మ ఆగ్రహానికి గురయ్యాడు.

కట్ చేస్తే... ఇప్పుడు అమ్మ ఆత్మ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. తిరువరూరుకి ఓ సాధువు తనతో అమ్మ మాట్లాడిందంటూ పెద్ద అలజడి రేపాడు. శ్రీ మహారిషి అనే ఓ సాధువు దెయ్యాలను వదిలించటంలో(చెప్పుకుంటున్నారు) స్పెషలిస్ట్. అతగాడు పన్నీర్‌సెల్వం ఇంటికి వెళ్లి కలిశాడు. భేటీ అనంతరం త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఆత్మ త‌న‌తో మాట్లాడి ప‌లు విష‌యాలు చెప్పింద‌ని ఆయ‌న అక్క‌డ మీడియాకు తెలిపాడు. త‌న‌ను ఆసుప‌త్రిలో 75 రోజుల పాటు ఉంచారని జ‌య‌ల‌లిత ఆత్మ‌ తనతో చెప్పిందని ఇంకా పలు విషయాలు పేర్కొన్నాడు.

Jayalalithaa Soul

అంతేకాకుండా పన్నీర్‌సెల్వం, దీప కలిసి ఏఐఏడీఎంకేను రక్షించాలని చెప్పమని జ‌య‌ల‌లిత‌ ఆత్మ తనని ఆదేశించిందని అందుకే తాను రంగంలోకి దిగానని చెప్పాడు. అమ్మ‌ పన్నీర్‌ సెల్వానికే మద్దతు తెలిపిందని, తక్షణమే పార్టీ వర్గాలు ఈ విషయాన్ని పరిశీలించాలని గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు. అయితే అమ్మ ఆత్మపై స్వామిజీ ప్రకటన పై కొన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఎలాగూ ఏ పార్టీలో లేడుకాబట్టి ఇక అమ్మ మేనకోడలు దీప జయకుమార్ పంచన చేరేందుకే సెల్వం రెడీ అయిపోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. 

 

ప్రణబ్ తో ఏం చెప్పారు?

ఇక రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ నేతృత్వంలోని 12 మంది ఎంపీల బృందం మంగళవారం ప్రణబ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించింది. జయలలితకు ఆస్పత్రిలో చేసిన చికిత్సకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. అలాగే శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండానే పళని స్వామి బలపరీక్ష నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారని, కాబట్టి విశ్వాస పరీక్షను రద్దు చేసి రహస్య ఓటింగ్‌కు ఆదేశించాలని వినతిపత్రంలో కోరారు. దాదాపు అరగంటపాటు ప్రణబ్‌తో భేటీ అయిన పన్నీర్ మద్ధతు ఎంపీలు జయ మృతిపై తమకున్న అనుమానాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మైత్రేయన్ విలేకరులతో మాట్లాడారు. జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు పోయెస్‌గార్డెన్‌లో ఏం జరిగిందో చెప్పాలని శశికళను డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న ‘అమ్మ’ను చూసేందుకు పన్నీర్ సెల్వాన్ని  సైతం అనుమతించలేదన్నారు. డిసెంబరు 4న జయకు గుండెపోటు వచ్చినట్టు చెబుతున్న వైద్యులు ఆమెకున్న వెంటిలేటర్‌ను ఎవరి అనుమతితో తొలగించారో చెప్పాలని డిమాండ్ చేస్తూ సిట్టింగ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తాము కోరినట్లు వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Deepa Jayakumar  Priest  Jayalalithaa Soul  

Other Articles