పశ్చిమ బెంగాల్ లోని జలపైగురి జిల్లా వాసులకు ఓ విచిత్రమైన ఘటన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకు కారణం ఓ ఏనుగు చేసిన ఫీట్. రైలు వస్తోందని సిబ్బంది రైల్వే గేటు వేశారు. అంతలో ఓ ఏనుగు నెమ్మదిగా అటు నడుచుకుంటూ వచ్చింది. అడవిలో తెగ బోర్ కొడుతుండటంతో అలా షికారుకు వెళ్తామనుకుంది. తనకు అడ్డుగా ఉందని భావించింది ఏమో సదరు గజరాజు గారు ఆ రైల్వే గేటును తన తొండంతో ఎత్తి పట్టాలు దాటి వెళ్లిపోయింది. ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
అభయారణ్యం నుంచి తప్పించుకున్న ఒక ఏనుగు బయటికి వెళ్లేందుకు నానా ప్రయత్నం చేసింది. అయితే చుట్టుపక్కల అంతా ఫెన్సింగ్ ఉండటంతో ఎలాగా అనుకుంటూ అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి చేరింది. ఎలా దాటాలో తెలీక వెంటనే ఆ గేట్ ను అమాంతం ఎత్తేసి దాటేయాలని యత్నించింది. అయితే అవతలి గేట్ వద్ద సేమ్ ఫీట్ రిపీట్ చేద్దామనుకున్నప్పటికీ వీలు కాకపోవటంతో దానిని తొక్కేసి తాపీగా వెళ్లిపోయింది.
వీడియో చోద్యంగా చూసిన చుట్టుపక్కల ప్రజలు తేరుకుని ఇప్పుడు భీతిల్లి పోతున్నారు. ఏ క్షణాన తమ ఊరిపై పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఏనుగుకి ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని, ఏనుగులు తరచూ ఇలా రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురవుతుంటాయని, అలా జరిగినప్పుడల్లా తమనే నిందిస్తారని ఓ అధికారి తెలిపాడు. ప్రస్తుతం ఆ మేధావి గజరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more