జాత్యంహకార దాడిపై అమెరికా అధ్యక్షుడు పెదవి విప్పకపోవటం నిరసన వ్యక్తం అవుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టిన 40 రోజుల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ట్రంప్ శ్రీనివాస్ కూచిభోట్ల హత్యపై స్పందించాడు. కాన్సస్ కాల్పుల ఘటనను తాను ఖండిస్తున్నట్లు తెలిపాడు. దేశంలో ఇటువంటి దాడులకు చోటు లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అమెరికా అతి శక్తిమంతమైన దేశమని, అమెరికా పౌరులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారికి ఉద్యోగాలు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. కంపెనీలు వెనక్కి వస్తున్నాయని పేర్కొన్న ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శలు చేశారు. ఆయన హయాంలో దేశంలో ఉగ్రదాడులు పెరిగాయని ఆరోపించారు. దేశంలో డ్రగ్స్‌ను అరికడతామని హామీ ఇచ్చారు.
విద్వేష దాడులను ముక్త కంఠంతో ఖండించాలని, ఇలాంటి విద్వేష దాడులకు అమెరికాలో తావు లేదంటూ మరోసారి ప్రకటించాడు. అంతకు ముందు శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి అమెరికా కాంగ్రెస్ నిమిషంపాటు మౌనం పాటించారు. శ్రీనివాస్‌ది ముమ్మాటికీ జాత్యాహంకార దాడేనని వైట్ హౌజ్ అంగీకరించింది. ‘ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలను బట్టి చూస్తే కాన్సస్ కాల్పులు.. జాతి వివక్షతో కూడిన విద్వేష దాడిగా రూడీ అవుతోంది. జాత్యంహకార దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండిస్తారు. ఇటువంటి దాడులను సహింబోమ’ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ మీడియాతో తెలిపాడు. గత బుధవారం రాత్రి కాన్సస్ లోని ఆస్టిన్స్ బార్‌లో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. మరో తెలుగు ఇంజనీర్ అలోక్ రెడ్డి, అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డ విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more