తమిళనాడులో బహుళజాతి కంపెనీలకు చెందిన శీతలపానీయాలు ఇక కనబడవు. చిన్న దుకాణాల నుంచి రిటైట్ షాపుల వరకు.. గ్రామీణ సినిమాహాళ్ల నుంచి పెద్ద మల్టీఫెక్స్ ల వరకు అన్ని చోట్ల ఇక పెప్సీ, కోకా- కోలా శీతలపానీయాలు లభించవు. విదేశీ బ్రాండ్ల అమ్మకాలను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో వర్తకులు ఎంఎన్సీ కంపెనీల శీతలపానీయాల బహిష్కరణకు పిలుపిచ్చారు. పెప్సీ, కోకా-కోలా లాంటి బహుళజాతి కంపెనీలు తమ నీటివనరులను దోచుకుంటున్నాయని వర్తక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల దుకాణాలు తొమ్మిది వర్తక సంఘాలకు అనుబంధంగా ఉన్నాయి. ఇందులో చాలావరకు ఇవాళ్టి నుంచి విదేశీ శీతలపానీయాల విక్రయం ఆపేస్తున్నాయి. ఇది పక్కన పెడితే.. సూపర్ మార్కెట్లు, హోటళ్లు మాత్రం వీటిని విక్రయిస్తూనే ఉన్నాయి. క్రమంగా వాటిలోనూ ఎంఎన్సీ కంపెనీల శీతలపానీయాలకు చెక్ పెట్టేలా తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక ప్రాంతీయంగా తయారు చేస్తున్న శీతల పానీయాల అమ్మాకాలకే తాము ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల వర్తక సంఘాలు ఈ మేరకు నిర్ణయానికి కట్టుబడి అమలు పర్చనుండటంతో ఇక తమిళనాట ఎంఎన్సీ కంపెనీల శీతలపానీయాలకు చుక్కెదురుకానుంది.
జల్లికట్టు ఉద్యమ సమయంలోనే విదేశీ పానీయాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి.. అ ఉద్యమం బాటలోనే ఈ ఉద్యమాన్ని కూడా తాము దిగ్విజయంగా కొనసాగించనున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ముందుగా సినిమాహాళ్లు, రిటైల్ దుకాణాలు, చిన్న దుకాణాలలో పెప్సీ కోలాను నిషేధించారు. ఈ కంపెనీలు తమ ఉత్పాదనల తయారీ కోసం తమ నీటిని వినియోగిస్తూ.. మళ్లీ తమ వద్ద నుంచే అధిక ధరలను వసూలు చేస్తుందని అన్నారు. అసలే నీళ్లు లేక రాష్ట్రం కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్న క్రమంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వనిగర్ సంఘం సెక్రటరీ మోహన్ చెప్పారు. అయితే తమిళనాడు తరహాలోనే యావత్ దేశంలోని రాష్ట్రాలన్నీ ఇలాంటి నిర్ణయాలనే తీసుకుంటే బాగుంటుందని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more