విమానంలో బాంబు ఉందంటూ నగరానికి చెందిన 27 ఏళ్ల ఓ మోడల్ కలకలం సృష్టించింది. సహార్ ఎయిర్ పోర్టులో టెర్మినల్ 2 వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. తీరా అది ఒట్టిదేనని ఆమె ఒప్పుకున్నప్పటికీ... పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసునమోదు చేశారు. సరిగ్గా రాత్రి 9 గంటలకు విమానం బయల్దేరుతుందనగా.. ముంబై మోడల్ కాంచన్ ఠాగూర్ తన స్నేహితురాలి బ్యాగులో బాంబు ఉందనీ జాగ్రత్తగా తనిఖీ చేయాలని సెక్యురిటీ గార్డులకు చెప్పింది. దీంతో విమానంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులకు చేరవేశారు.
విమానాన్ని ఆపి ఆమెను, ఆమె ముగ్గురు స్నేహితురాళ్లను కిందికి దించేశారు. అయితే బాంబు మాట ఒట్టిదేననీ తాను సరదాగా అలా అన్నాననీ సదరు మోడల్ అధికారులతో వాగ్యుద్ధానికి దిగింది. అయినా గంటసేపటి తనిఖీల తర్వాత కాంచన్, ఆమె మిత్రబృందం లేకుండానే ఢిల్లీ విమానాన్ని పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.. ‘‘నిజంగా ఉగ్రవాదులు విమానం ఎక్కినా పట్టుకోలేరు... కానీ జోక్ చేసినందుకు మాత్రం ఇంతలా చేస్తారా’’ అంటూ విరుచుకుపడింది.
అయితే పుకార్లు సృష్టించి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన వీరికి బుద్ధి చెప్పకుండా వదిలేది లేదని అధికారులు పేర్కొన్నారు. కాంచన్ను అరెస్టు చేసి ఐపీసీ 505(1)(బి) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు ఆమెతో పాటు ఆమె మిత్రులు నగరాన్ని విడిచి వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. కాగా మోడల్ స్నిహితురాళ్లలో ఒకామె తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మిగతా వారంతా ఆమెకు తోడుగా ఢిల్లీ వెళ్లేందుకు బయల్దేరారు. తీరా కాంచన్ నిర్వాకంతో వారంతా ముంబైకి పరిమితం కావాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more