వేల కోట్లు ఎగ్గొట్టి దర్జాగా విదేశాల్లో జాలీగా గడుపుతూ, మధ్య మధ్యలో మీడియాపై విరుచుకుపడుతున్న విజయ్ మాల్యా గురించి కేంద్ర ప్రభుత్వం సంగతి ఏమోగానీ, సుప్రీం కోర్టు మాత్ర స్పందించింది. అంతేకాదు ఓ కేసును అడ్డుపెట్టుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ కేసు ఎక్కడిదో కాదు. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించింది కావటమే ఇక్కడ కొసమెరుపు.
ఎల్లయ్య అనే వ్యక్తి చీరల దొంగతనం కేసులో గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ట్రయల్ లేకుండానే అతగాడు ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్నాడు. కేవలం ఐదు చీరలు దొంగతనం చేసినందుకే తన భర్తను విచారణ కూడా లేకుండా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అతని భార్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు ధర్మాసనం ముందుకు రాగా న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ మాల్యాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ఓ వ్యక్తి ఉన్నాడు. బ్యాంకుల నుంచి కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. పైగా అక్కడ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. కానీ, ఇక్కడో వ్యక్తి ఐదు చీరలు దొంగతనం చేశాడని బోనులో నిలబెట్టారు. ఇది ఎంత దారుణం’’ అంటూ పరోక్షంగా మాల్యా గురించి వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎలాంటి ఆధారాలు లేకుండా ఎల్లయ్యను అరెస్ట్ చేశారని అతని తరపు న్యాయవాది వాదించగా, చీరల దొంగతనం గురించి షాపు యజమానులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము అదుపులోకి తీసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు బుధవారం మళ్లీ విచారణకు రానుంది.
61 ఏళ్ల మాల్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కుప్పకూలిపోవటంతో 9,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టి యూకే పారిపోయిన(మాల్యా దృష్టిలో తలదాచుకోవటం) విషయం తెలిసిందే. ఈ మధ్యే తాను అక్కడ సురక్షితంగా ఉన్నానని చెప్పటమేకాదు, తనను భారత్ కు తీసుకెళ్లే హక్కు ఎవరికీ లేదంటూ కామెంట్ కూడా చేశాడు.
ఇవి కూడా చదవండి...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more