ఆర్మీ అసుపత్రిపై ఉగ్రదాడి.. భారీ పేలుళ్లతో తెగబడ్డ ముష్కరులు Serial Blasts in Afghanistan’s Biggest Army Hospital

Serial blasts in biggest army hospital is owns responsiblity

Kabul, military hospital, suicide bombers, army hospital, afganistan, Islamic state, pakistan terrorists

At least two persons were killed and 23 injured when three explosions rocked a military hospital here on Wednesday.

ఆర్మీ అసుపత్రిపై ఉగ్రదాడి.. భారీ పేలుళ్లతో తెగబడ్డ ముష్కరులు

Posted: 03/08/2017 03:51 PM IST
Serial blasts in biggest army hospital is owns responsiblity

అఫ్ఘానిస్థాన్‌ హోంశాఖ కార్యరర్శి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముష్కరులు అదేశంపై దాడులకు పాల్పడుతున్నారు. వారం, పది రోజుల క్రితం అప్ఘనిస్తాన్ మంత్రి పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదంలో తమ దేశ భధ్రత కూడా ముఫ్పువాటిల్లుతందని, దేశంలోకి అక్రమంగా చోచ్చుకువస్తున్న ఉగ్రవాదులు అనేక జనసామార్థ్య ప్రాంతాల్లోకి చోచ్చుకెళ్లి బాంబు దాడులకు పాల్పడుతూ తమ దేశ పౌరుల ప్రాణాలను బలిగోంటున్నారని, దీనిపై తక్షణం పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే అప్ఘన్ రాజధాని కాబుల్ లో అత్మహుతి దళాలు దాడులు చేశాయి.

తాజాగా అదేశ రాజధాని కాబూల్‌ మరోసారి ఉగ్రదాడులతో దద్దరిల్లింది. కాబూల్‌లోని అతిపెద్ద మిలటరీ ఆస్పత్రి లక్ష్యంగా ఉగ్రవాదులు బుధవారం దాడికి తెగబడ్డారు. అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న నాలుగువేల పడకల సర్దార్‌ మహమ్మద్‌ దౌద్‌ ఖాన్‌ ఆస్పత్రిలోకి ఐదుగురు సూసైడ్‌ బాంబర్స్‌ చొరబడ్డారు. అందులో ఒకడు ఆస్పత్రి గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. అతడు డాక్టర్‌ దుస్తులు ధరించినట్టు తెలుస్తోంది. మిగతా నలుగురు సూసైడ్‌ బాంబర్ల ఆస్పత్రిలో చొరబడటంతో లోపల ఉన్న వైద్యులు, సిబ్బంది, రోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఈ సూసైడ్‌ బాంబర్లను తుదముట్టించేందుకు ప్రస్తుతం భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రవాదులు ఆస్పత్రిలోకి చొరబడ్డారని, ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అఫ్ఘాన్‌ రక్షణశాఖ తెలిపింది. 'దుండగులు ఆస్పత్రి లోపల ఉన్నారు. మా భద్రత కోసం ప్రార్థించండి' అంటూ ఆస్పత్రి సిబ్బంది ఒకరు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. గతవారం కాబూల్‌లో జరిగిన తాలిబన్‌ జంట సూసైడ్‌ బాంబు పేలుళ్లలో 16మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles