కళ్యాణ గడియలు వస్తే.. అగదని, ఎలాంటి వారికైన పెళ్లి జరిగిపోతుందని అంటారు పెద్దలు. అయితే దీనిని ఈ కాలంలో నమ్మని వారికి నమ్మాకన్ని కుదర్చే ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. అమెకు కళ్యాణ గడియలు రాలేదు.. అయినా పెద్దలు పెళ్లి సంబంధాన్ని కుదిర్చారు. సరిగ్గా ముహూర్తం రోజున కానీ వధువరుల కుటుంబ పెద్దలకు తెలియలేదు అమెకు కళ్యాణ గడియలు రాలేదని. అయితే అమె చెల్లికి మాత్రం కళ్యాణ గడియలు వచ్చేశాయి.
అమెకు చదువంటే ప్రాణం.. తన ప్రాణాన్ని అదేనండీ చదువును కాదని అమె పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వధువు సరిగ్గా కళ్యాణం రోజున ముహుర్తానికి ముందు విషం సేవించింది. సరిగ్గా అదే ముహూర్తానికి వరుడి.. వధువు చెల్లెలి మెడలో మూడుమూళ్లు వేశాడు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తురయూర్ సమీపంలో గల బట్టంపట్టికి చెందిన బాలకుమార్ (27) వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి సేలం జిల్లా సెందారపట్టికి చెందిన శరణ్య (20)తో వివాహం నిశ్చయమైంది. వీరికి బుధవారం తురయూరులో గల ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మండపంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దీని కోసం మంగళవారం రాత్రి రిసెప్షన్ జరిగింది. బుధవారం ఉదయం పెళ్ళి కూతురు మండపానికి తీసుకురావాల్సిన స్థితిలో ఆమె విషం తాగి స్పృహతప్పి పడిపోయింది. దీనిపై ఆరాతీయగా ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఇంకా పై చదువులు చదవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై పెళ్ళికొడుకు తరపు వారు తురయూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపారు. రెండు కుటుంబాల వారితో చర్చలు జరిపారు. ఈ మేరకు పెళ్లి కూతురు చెల్లెలు సంగీత (18)ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అనంతరం సంగీత సమ్మతంతో బాలకుమార్, సంగీత వివాహం జరిగింది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more