పక్కలో బల్లెంనే సీఎం చేసేశారు | BJP's N Biren Singh set to be new Manipur Chief Minister.

N biren singh is bjp pick for manipur cm

N Biren Singh, Manipur New CM, CM Biren Singh, Manipur Biren Singh, Biren Singh Political Carrier, Manipur BJP, MAnipur Congress, Congress Biren Singh, Biren Singh Ibobi Singh

BJP Names N Biren Singh As Chief Minister-Designate Of Manipur.

కొత్త ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్

Posted: 03/14/2017 07:46 AM IST
N biren singh is bjp pick for manipur cm

మణిపూర్ కొత్త సీఎంగా బీజేపీ నేత ఎన్ బీరెన్ సింగ్ ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. 56 ఏళ్ల బీరెన్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ఎమ్మెల్యేల మద్ధతు లభించటంతో గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించింది. మరోపక్క ఏకపక్ష నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి ఓక్ రాం ఇబోబీ సింగ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాడు.

ఇక మణిపూర్ బీజేపీ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఎన్.బీరెన్ సింగ్ గతంలో కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది ఇబోబీతో వైరం కారణంగా బయటికి వచ్చి కాషాయం కండువా కప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆయనకు బీరెన్ పక్కలో బల్లెంగా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే బీరెన్ సేవలను వాడుకుంటూ వస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కాగా, మణిపూర్ సీఎం ఇబోబి సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నారు.

కాగా, ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో కాంగ్రెస్ 28, బీజేపీ 21, టీఎంసీ 1, ఇతరులు పది స్థానాల్లో విజయం సాధించారు. తమకు తృణమూల్ సభ్యుడి మద్ధతు ఉందని, కాస్త సమయం ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇబోబీ చేసిన విన్నపాన్ని గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఓట్ల శాతంలో కాంగ్రెస్ 35.1 కాగా, బీజేపీ 36.3 సాధించటం మూలంగానే గవర్నర్ వారికే ముందు అవకాశం ఇచ్చి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బీరెన్ సింగ్ నేపథ్యం...

పుట్ బాల్ ప్లేయర్ నుంచి జర్నలిజంలోకి ఆపై 2002 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు బీరెన్ సింగ్. హెయిన్ గ్యాంగ్ నుంచి డీఆర్పీపీ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీరెన్ ఫస్ట్ టైమే విజిలెన్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు కూడా. ఆపై కాంగ్రెస్ లో విలీనం కావటంతో ఇరిగేషన్ మరియు ఆహార నియంత్రణ శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. గతేడాది మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడి హోదాలో ఇబోబీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం లేవదీసి పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు. అనంతరం బీజేపీ పంచన చేరి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబోతున్నాడు.   

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manipur  BJP Government  Biren Singh  New Chief Minister  

Other Articles