జగన్ జైల్లో ఉండగా భూమానే దిక్కయ్యాడా? | SV Mohan Reddy fire on YS Jagan

What bhuma did for jagan family when he was in jail

YS Jagan Bhuma Nagi Reddy , AP Assembly Bhuma Condolence, Bhuma Nagi Reddy Condolence Meet, S.V.Mohan Reddy Speech, Mohan Reddy Jagan Family, Mohan Reddy YS Jagan, YS Jagan Bhuma, YSRCP Skip Bhuma Condolence

TDP Leader SV Mohan Reddy fire on YS Jagan for skipping Bhuma Nagi Reddy Condolence Meet in Assembly.

జగన్ జైల్లో ఉండగా భూమా ఏం చేశాడంటే...

Posted: 03/14/2017 11:31 AM IST
What bhuma did for jagan family when he was in jail

టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి మంగళవారం ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ సభలో పలువురు ప్రసగించారు. ఈ క్రమంలో సంతాప తీర్మానానికి హాజరుకాకపోవటంపై ప్రతిపక్ష వైఎస్సార్పీపీపై అంతా మండిపడ్డారు. కడసారి చూపు చూడకపోవటం, అంత్యక్రియలకు హాజరుకాకపోవటం మాట అటుంచి కనీసం సంతాప సభకు కూడా హాజరుకాకపోవటంపై విమర్శలు వినిపించాయి. ఇంతటి దారుణమైన ప్రతిపక్షాన్ని తాము ఎన్నడూ చూడలేదని, జగన్ కుసంస్కారానికి ఇది నిదర్శనమని అధికార పక్ష ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.

శోభా సోదరుడు, భూమా బావ మరిది అయిన ఎస్వీ మోహన్ రెడ్డి అయితే కాస్త ఘాటుగానే జగన్ పై ఆరోపణలకు దిగాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమా చేసిన మేలును మరిచిపోయి, దుర్మార్గంగా ప్రవర్తించిందని ఫైర్ అయ్యాడు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్న వేళ, ఆ పార్టీకే కాదు, జగన్ కుటుంబానికి భూమా ఎంతో అండగా నిలిచాడని తెలిపాడు. ఆయన చేసిన సాయం ఏంటో నా ఒక్కడికే తెలుసంటూ రామ్మోహన్ వ్యాఖ్యానించటం విశేషం.

 

ఇక జైగన్ జైలుకెళ్లిన బాధలో ఉన్న విజయమ్మను ఓ తమ్ముడిలా భూమా ఓదార్చేవాడని, కానీ, ఇప్పుడు దాన్ని మరిచి ఇలా ప్రవర్తించటం సరికాదంటూ తెలిపాడు. అసలు శోభా నాగిరెడ్డి విజయమ్మ తరఫున ప్రచారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మరణించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పార్టీ కోసమే భూమా తన భార్యను కోల్పోయారని తెలిపాడు. అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం సంతాపం చెప్పేందుకు కూడా వారు రాలేదని, వారు ఇంత దిగజారుతారని తాను అనుకోలేదని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bhuma Nagi Reddy Condolence  Assembly Budget Session  YSRCP Skip  

Other Articles