గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ అశలు గల్లంతయ్యాయి. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపికి తలొగ్గిన గవర్నర్ మృదులా సిన్హా బీజేపి పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడాన్ని సవాలు చేస్తూ.. కాంగ్రెస్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించింది. కాగా అక్కడ కూడా కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బలమెక్కడ వుందని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
మీకు నిజంగా బలమేవుంటే రాజ్ భవన్ ఎదుట ఎందుకు ధర్నా చేయలేదని సుప్రీంకోర్టు కాంగ్రెస్ ను ప్రశ్నించింది. ఇక కాంగ్రెస్ నేతల పిటీషన్ పై విచారణ జరుపుతూ.. వారి తరపున వారు తమ పిటీషన్ లో పేర్కోన్నట్లుగా.. ముందుగా గోవాలో మనోహర్ పారికర్ ప్రభుత్వం రానున్న 48 గంటల వ్యవధిలో బలాన్ని నిరూపించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అదేశించింది. ఈ బలనిరూపణకు గోవా అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యుడ్ని ప్రోటెమ్ స్పీకర్ గా నియమించాలని కూడా అదేశించింది. అయితే పారికర్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని మాత్రం అడ్డుచెప్పబోమని తెలిపింది.
అదే సమయంలో కాంగ్రెస్ నేతలు గోవా గవర్నర్ మృదులా సిన్హాను కలవాలని కూడా అదేశించింది. దీంతో మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. కాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఫన్జిమ్ లోని కాంగ్రెస కార్యాలయంలో సంబరాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ నేతల్లో సంతోషం వికసించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిచిన విశ్వజీత్ రాణేూ, దయానంద్ సోప్టేలు అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. సుప్రీం తీర్పుపై బీజేపి ఎమ్మెల్యే జీవిఎల్ నర్సింహా రావు స్పందిస్తూ.. న్యాయస్థానం కాంగ్రెస్ కు బాసటగా నిలిచిందన్నారు.
40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండటంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటుచేస్తామని గోవా కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. కానీ, కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికే రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీ ఫిగర్‌ను సాధించింది. ఈ పరిణామంతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు గోవా సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more