గర్ల్స్ హాస్టల్ లో కాక్ టెయిల్ విందు.. వార్డెన్ సహా బంధువలు చిందు.. warden turns girls hostel into convention centre

Warden turns girls hostel into convention centre for his daughter birthday

hostel warden, liqour in girls hostel, function in girls hostel, social welfare hostel, 10th class student, warden daughter birthday, shadnagar, mahaboobnagar

shadnagar social welfare hostel causes disturbence for 10th class students who are preparing for exams begining from 17 march, on his daugher birthday.

గర్ల్స్ హాస్టల్ లో కాక్ టెయిల్ విందు.. వార్డెన్ సహా బంధువలు చిందు..

Posted: 03/14/2017 02:08 PM IST
Warden turns girls hostel into convention centre for his daughter birthday

అనుక్షణం అప్రమత్తంగా వుండాల్సిన గర్ల్స్ హాస్టల్ వార్డెన్.. నిబంధనలకు నీళ్లు వదిలి హాస్టల్ ను ఫంక్షన్ హాల్ గా మార్చేశారు. తన కూమార్తె జన్మదిన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 17 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో వారు ఉత్తమ మార్కులను సాధించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన వార్డెన్.. విద్యార్థుల ఎటుపోతే తనకేంటి అన్న ధోరణితో వ్యవహరించి.. అర్థరాత్రి వరకు హాస్టల్ ను ఆటపాటలతో హోరెత్తించాడు. పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థినులకు అవరోధాలు కల్పించాడు. హస్టల్ లోకి డీజే సిస్టమ్ ను తీసుకువచ్చి.. పెద్ద శబ్దంలో హోరెత్తించాడు.

షాద్‌నగర్‌ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఈ చర్యలను పాల్పడ్డాడు. దీంతో హాస్టల్‌ వార్డెన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌, ఏబీవీపీ, టీఆర్‌ఎస్‌వీ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ వసతిగృహంలోకి కల్లు, మద్యం సీసాలను తీసుకొచ్చారని, డీజేలతో హోరెత్తించారని ఆరోపించారు. బయటి వ్యక్తులను వసతిగృహంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.
 
విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన వార్డెన్ నే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే ఎలాగని అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ వసతి గృహాల జాయింట్‌ డైరెక్టర్‌ సురేష్‌రెడ్డి, తహసీల్దార్‌ చందర్‌రావు, ఎంపీడీవో రాజేశ్వరి వార్డెన్‌ నుంచి వివరాలు సేకరించారు. పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు పార్టీనిర్వహించామని, అది కూడా విద్యార్థులు కోరితేనే నిర్వహించానని వార్డెన్‌ వివరణ ఇవ్వగా, అధికారులు దానినే తమ నివేదికలో రాసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girls hostel  social welfare department  10th class students  shadnagar  mahaboobnagar  

Other Articles