డిజిట్ మనీ మాయాజాలం.. డాక్టరుకే బురిడీ.. రూ. 40కి బదులు 4 లక్షలు.. doctor’s card swiped for Rs 4 lakh instead of Rs 40

Karnataka doctor s card swiped for rs 4 lakh instead of rs 40 at toll booth

card payment, online payment, mysuru doctor, gundmi gate, Digital Payment, card swipe, digital transactions, digital money, Kochi, Mumbai, Gundmi toll gate, Toll, Toll Booth,Udupi, digital crime, digital fraud

A groggy toll attendant swiped Rs 4 lakh instead of Rs 40 from a doctor's debit card at Gundmi toll gate on the Kochi-Mumbai National Highway near Udupi

డిజిట్ మనీ మాయాజాలం.. డాక్టరుకే బురిడీ.. రూ. 40కి బదులు 4 లక్షలు..

Posted: 03/14/2017 01:14 PM IST
Karnataka doctor s card swiped for rs 4 lakh instead of rs 40 at toll booth

దేశ్యవ్యాప్తంగా ప్రజలందరూ డిజిటల్ లావాదేవీలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కార్డుల హ్యాకింగ్ లు ఓ వైపు అందోళన రేపుతున్న క్రమంలో కొత్త మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. విద్యావంతులైనవారినే మోసగాళ్లు తమ చర్యలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇక వాటి గురించి అవగాహన లేకపోతే.. మోసగాళ్ల వేటుకు బలికావాల్సిందే. ఓ వైపు టు పర్సెంట్ టక్స్ పడుతుందంటూ కొత్త మోసాలకు తెరలేపుతున్న క్రమంలో ఇలాంటి మోసగాళ్ల దెబ్బతిని ఓ డాక్టరు షాక్ కు గురయ్యారు. డిజిటల్ లావాదేవీలలో ఏ మాత్రం ఏమరుపాటు వున్నా.. నగదు గోవిందా అన్న విషయం మాత్రం మర్చిపోవాల్సిందే.

కార్డుల స్వైప్ చేయగానే కస్టమర్ కాపీని తీసుకుని ఎంత డబ్బు తీసుకున్నారో పరిశీలించకపోతే.. పడరాని పాట్లు పడాల్సిందే. ఇలాంటి ఇలాంటి సంఘటనే ఒకటి కొచ్చి-ముంబాయి జాతీయ రహదారి దగ్గర్లో ఉడిపి వద్ద చోటుచేసుకుంది.  గుండ్మి టోల్ గేట్ వద్ద మైసూరుకు చెందిన  ఓ డాక్టర్ కార్డుపై రూ.40 బదులు రూ.4లక్షలు స్వైప్ చేశారు. మైసూరుకు చెందిన డాక్టర్ రావు, తీరప్రాంతం మీదుగా ముంబాయికి వెళ్తున్నారు. రూ.40 టోల్ చెల్లించడానికి ఆయన తన డెబిట్ కార్డు ఇచ్చారు. కార్డును స్వైప్ చేసిన అటెండెంట్ పీఓసీ రశీదు కూడా ఇచ్చాడు.
 
కానీ మొబైల్ కు వచ్చిన మెసేజ్ లో మాత్రం రూ.4లక్షల తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్టు వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే డాక్టర్ టోల్ గోట్ స్టాఫ్ కు నోటీసు చేశారు. అయితే వారు మాత్రం తమ తప్పిదాన్ని  ఒప్పుకోవడానికి ససేమీరా అన్నారు.  టోల్ గేట్ వారు చేసిన ఈ తప్పిదంపై రావు దగ్గర్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి పోలీసులు దిగడంతో ఇక చచ్చినట్టు వారు తమ తప్పిందాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది.  టోల్ గేట్ అటెండెంటే తప్పుడు మొత్తాన్ని స్వైప్ చేసినట్టు తెలిపాడు. డాక్టర్ కు తన నగదుతో పాటు, వారు అదనపు మొత్తాన్ని కూడా ఆఫర్ చేశారు. కానీ డాక్టర్ మాత్రం తన డబ్బుల్నే తీసుకున్నాడు. ఈ టోల్ గేట్ వద్ద రోజుకి రూ.8 లక్షల వరకు వసూలు అవుతున్నట్టు పోలీసులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka doctor  Kochi  Mysuru doctor  Mumbai  Gundmi toll gate  Udupi  digital crime  digital fraud  

Other Articles