ఏటీఎం లు నో క్యాష్ బోర్డుతో వెక్కిరిస్తున్నాయా?, మరోవైపు బ్యాంకుల అడ్డగొలు నిబంధనలతో విసిగిపోయి ఉన్నారా? ఫర్వాలేదు. మిమల్ని ఆదుకునేందుకు మేమున్నాం అంటూ పోస్టల్ డిపార్ట్ మెంట్ ముందుకు వస్తోంది. అందుకోసం మీరు చేయాల్సిన జస్ట్ వంద రూపాయలతో కొత్త ఖాతా తెరవటమే. దీంతో బ్యాంకులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలు ఇప్పుడు కొత్త అస్ర్తం దొరికినట్లయ్యింది.
ఖాతాలో కనీస మొత్తం ఆంక్షలు లేకపోవడం, గరిష్టంగా ఎంతైనా జమచేసుకునే వీలుండడంతో ఖాతాలు తెరిచేందుకు పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్, అబిడ్స్, ఖైరతాబాద్ పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిచేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. తొలుత ఖాతా తెరిచేందుకు కేవైసీ నియమాలను పాటించాలని, డబ్బు జమను బట్టి పాన్, ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని పోస్టల్ అధికారులు తెలిపారు. ఖాతా తెరిచిన అనంతరం 15 రోజుల్లో ఏటీఎం కార్డు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డును ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
పెద్ద నగరాల్లో అయితే పోస్టల్ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. పైగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండటంతో తమ ఖాతాలను తరలించే పనిలో ఉన్నారు కస్టమర్లు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 5 లక్షలకు పైగా సేవింగ్ అకౌంట్లు ఉన్నాయని, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఖాతాలు తెరిచినట్టు పోస్టల్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నిజానికి మిగతా రాష్ట్రాల్లో ఈ వెసులుబాటు డిసెంబర్ నుంచే ప్రారంభం కాగా, తాజా బ్యాంకుల నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వాటి వైపు మొగ్గు చూపటం విశేషం. నోట్ల రద్దు తర్వాత నిబంధనలు, ఆంక్షల పేరిట ఖాతాదారులను ఆటాడుకున్న బ్యాంకులకు ఇప్పటికే నో ట్రాన్సాక్షన్ డే అంటూ పిలుపు రాగా, మున్ముందు కొత్త షాకులు తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more