షాకింగ్ వీడియో: వరుడు సింహం మీద ఊరేగాలనుకున్నాడు... కానీ చివరకు ఏమైందో చూడండి... | Groom arrives not on Ghodi or Gaadi but Lion.

Pakistani groom tries to enter wedding riding a lion

Pakistan Bride Groom, Shaikh Mohammad Wedding, Bride Groom Lion Ride Video, Bride Groom Triple H Entrance, Triple H Lion Entrance, Ghodi or Gaadi but Lion, Lion Ride for Bride Groom, Pakistan Bride Groom

A Bride Groom In Pakistan Entered His Wedding On A Caged Lion. Shaikh Mohammad from Multan wanted to reach to his bride’s home on a Lion and requested his 'rich' father to arrange one for him. However, the Lion was in cage but the groom still managed to fetch attention.

ITEMVIDEOS:పాక్ పెళ్లి కొడుకు పైత్యం

Posted: 03/18/2017 08:27 AM IST
Pakistani groom tries to enter wedding riding a lion

తమ జీవితంలో ఓ గొప్ప రోజు కాబట్టే వివాహ వేడుకల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతూరులు స్థాయిని బట్టి తమ దర్పం చూపించేందుకు యత్నిస్తుంటారు. వారి సంతోషం కోసం, అదే సమయంలో ప్రతిష్టల కోసం అన్నట్లుగా తల్లిదండ్రులు కూడా ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. కానీ, ఈ రోజుల్లో వాటికి అదనంగా కాస్త వినూత్న ప్రయత్నాలే చేస్తూ కొందరు జనాల దృష్టిని ఆకట్టుకుంటున్నారు . అయితే ఇక్కడో ఓ పెళ్లి కొడుకు చేసిన ప్రయత్నం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా వివాహ వేడుకల్లో వధువు, వరులను ఉరేగించేందుకు గుర్రాలు, ఏనుగు, పాత కాలపు నాటి కార్లను వాడటం చూశాం. కానీ, పాకిస్థాన్ లో మాత్రం ఓ పెళ్లి కొడుకు బుర్రలో ఓ విచిత్రమైన ఆలోచన మెదిలింది. స్వతహాగా బిలీనియర్ కావటంతో సింహంపై ఊరేగితే ఎలా ఉంటుందని ఆలోచన చేశాడు. అంతేనా వెంటనే దానిని ఆచరణలో పెట్టాడు కూడా.

 

ముల్తాన్ కు చెందిన షేక్ మహ్మద్ తన వివాహ వేడుక చాలా రిచ్ గా ఉండాలని ఫ్లాన్ చేశాడు. వెంటనే ధనికుడైన తన తండ్రితో ఆలోచన చెప్పి అందుకు ఒప్పించాడు కూడా. అయితే డైరక్ట్ సింహంపై కూర్చోవటం సాధ్యం కాదు కదా. అందుకే బోనులో ఉండగానే దానిపై ఓ కుర్చీ వేసి అందులో కూర్చోబెట్టి అడ్జస్ట్ చేశారంట. బ్యాగ్రౌండ్ లో రెజ్లింగ్ స్టార్ ట్రిపుల్ హెచ్ మ్యూజిక్ ను ప్లే చేస్తూ ట్రక్కుపై ఊరంతా ఊరేగిస్తూ మండపం దాకా తీసుకెళ్లారు. ఇక పెళ్లికి వచ్చిన వారికి బైకులు, కార్లు ఇలా ఖరీదైన గిప్ట్ లనే రిటర్న్ గిప్ట్ గా ఇవ్వటం మరో హైలెట్. సింహంపై ఊరేగాలన్న కల పూర్తిగా నెరవేరకపోయినప్పటికీ, అతనికి ఆ క్షణాలు మాత్రం జీవితాంతం గుర్తుండి తీరుతుంది. కాదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Bride Groom  Lion Riding  

Other Articles