ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి, దానిపై చర్చించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో నవ్యాంధ్ర అసెంబ్లీలో ఇవాళ ఉదయం నుంచి అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, దూషణల పర్వాలు చోటుచేసుకున్నాయి. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య అమర్యాద పిలుపు, నువ్వెంత.. అంటే నువ్వెంత.. అనే స్థాయికి వెళ్లాయి. బయటికి రండీ చూసుకుందాం అనే వరకు వెళ్లాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మాణాలపై చర్చను అడ్డుకునేందుకు ధీటుగా వ్యూహప్రతివ్యూహాలను ముందుగానే రచించుకున్న అధికార పక్షం ఇవాళ సభ ప్రారంభం కాగానే అగ్రిగోల్డ్ అంశాన్ని మళ్లీ ప్రస్తావిచింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో భూములు కొన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అధినేత జగన్కు సవాల్ విసిరి.. లేదంటే మీరు రాజీనామా చేస్తార అన్న సవాల్ ను విసిరారు. ఈ అంశంపై ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా, ముందు చాలెంజ్ కు స్వీకరిస్తారా..? లేదా.? ఈ విషయాన్ని చెప్పండీ అంటూ అధికార సభ్యులు అరవడం.. ఇక సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించడం లేదని ప్రతిపక్ష సభ్యులు అరోపిస్తున్నారు.
సభ ప్రారంభం కాగానే ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులపై సభలో చర్చించాలని వైసీపీ డిమాండ్ చేయగా, ప్రశ్నోత్తరాల తరువాత చర్చిద్దామని స్పీకర్ కోడెల అన్నారు. ముందుగా అ అంశంపై చర్చించాలని పట్టుబట్టిన వైసీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి.. నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచ్చచేయడానికే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
ఈ క్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రతిపక్ష నేత పట్ల అమర్యాదగా వ్యవహరించారు. తోటి సభ్యుల పట్ల గౌరవ ప్రదంగా వ్యవహరించాల్సిన అధికార సభ్యులు అమర్యాదగా, ఏకవచనంతో సంభోధించడం.. చాల్లే మాట్లాడింది అంటూ అనుచితంగా అడ్డుకున్నారు. అధికార సభ్యుడు బోండా ఉమ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష సభ్యులు అరోపిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీటులో సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావన, సుప్రీంకోర్టు నోటీసులపై చర్చను అడ్డుకునేందుకే వారి ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మొత్తానికి సభలో ఇవాళ అమర్యాద, అగౌరవ ఘటనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు కేంద్రంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more