పవన్ కన్నా చిరు ఎంతో బెటర్ అన్న ఫైర్ బ్రాండ్ | Chiru is better than Pawan Kalyan.

Roja says pawan kalyan a part time politician

Janasena Pawan kalyan, Pawan Kalyan Roja, MLA Roja Interview, Roja Encounter with Murali, MLA Roja TV9, Roja TV9 Interview, Roja Janasena, Roja Satire Pawan Kalyan

YSRCP MLA Roja on Pawan Kalyan's political journey. Says Pawan is a part time politician, and did not achieve anything with Janasena.

జనసేనతో పవన్ సాధించిందేంటి?- రోజా

Posted: 03/27/2017 10:54 AM IST
Roja says pawan kalyan a part time politician

ప్రతిపక్ష వైఎస్సార్పీపీ ఫైర్ బ్రాండ్ రోజా జనసేన అధినేత పవన్ పై మళ్లీ విమర్శలు చేసంది. గతంలో హోదా సమయంలో అధికార పక్షాల భజన చేస్తూ, ప్రజలను విస్మరిస్తున్నాడంటూ చెబుతూ రబ్బర్ సింగ్ అంటూ పవన్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే దానికి పవన్ గట్టి కౌంటరే ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ పవన్ పొలిటికల్ జర్నీపై విసుర్లు విసిరింది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పవన్ తో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు రోజా సమాధానం ఇస్తూ.. పవన్ ను చూసి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. షూటింగ్ లు చేసుకుంటూ, గ్యాప్ లో ట్విట్టర్ లో, అప్పుడప్పుడు టీవీ ల్లో ఇంటర్వ్యూలు ఇచ్చే వ్యక్తికి ప్రజలు ఎలా పట్టం కడతారన్నది వారి విజ్నతకే వదిలేస్తున్నా అంది. అయినా రాజకీయాలకు పవన్ కొత్తేం కాదని, ప్రజా రాజ్యం నుంచే ఉన్నాడని చెబుతోంది.

 

పైగా జనసేన పార్టీని పెట్టి ఇంతకాలం అయినా పవన్ కళ్యాణ్ సాధించిందేంటని ఆమె ప్రశ్నిస్తోంది. మోదీ, చంద్రబాబులకు జై కొడుతూనే, ఏదైనా తప్పు జరిగితే తాను ప్రశ్నిస్తానంటూ చెప్పిన పవన్, ఇప్పుడు సైలెంట్ గా కూర్చున్నాడని అంటోంది. ఇప్పటిదాకా ఒక ఎన్నికలో కూడా పోటీ చేయలేదని సెటైర్లు వేసింది. ఇక పవన్ కన్నా సోదరుడు చిరంజీవే మేలని... ప్రజారాజ్యం పార్టీని స్థాపింది, ఎన్నికల్లో పోటీ చేసి, కనీసం 18 స్థానాల్లో అయినా చిరు గెలుపొందారని చెప్పింది. కనీసం ఆ ధైర్యం కూడ చేయకుండా, అన్యాయాలను కూడా ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉన్నాడని మండిపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  MLA Roja Interview  

Other Articles