యోగి దిస్ ఈజ్ టూమచ్.. కీ డెసిషన్లు మరి అలానా? | Yogi Adityanath One Week Ruling Review.

Yogi adityanath quick decisions creates controversy

Uttar Pradesh CM, Yogi Adityanath, Yogi Adityanath Decisions, Uttar Pradesh Yogi Adityanath, Yogi Adityanath Zafaryab Jilani, Babri Masjid Committee Convenor Zafaryab Jilani, Ayodhya Issue, 50 Decisions 150 hours, Yogi Adityanath 50 Decisions, Yogi Adityanath Controversy

Yogi Adityanath takes 50 decisions as Uttar Pradesh CM without single Cabinet meet.

సీఎంగారూ... ఈ దూకుడేంది బాబోయ్

Posted: 03/27/2017 01:15 PM IST
Yogi adityanath quick decisions creates controversy

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా నిన్నటికి వారం అయ్యింది. ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. అయితే దాంతో సంబంధం లేకుండా 50కి పైగా నిర్ణయాలను తీసుకుని పాలనలో దూసుకుపోతుండటం ఆవ్చర్యానికి గురిచేస్తోంది. మరోపక్క నిర్ణయాలు వెనువెంటనే అమలయ్యేలా చూస్తూ ఉన్నతాధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. 150 గంటల వ్యవధిలో ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు యావత్ దేశం చూపు ఆయన వైపు మళ్లేలా చేసింది. అంతేకాదు కాబోయే ప్రధాని అంటూ కొందరి నుంచి డిమాండ్ వినిపించేలా చేస్తుంది.

తొలి మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకుండానే దుందుడుకుగా ఆయన తీసుకున్న వాటిల్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇల్లీగల్ మాంసదుకాణాలపై నిషేధం, యాంటీ రోమియో స్క్వాడ్ పేరిట అమ్మాయిల భద్రతపై దృష్టి, మానససరోవర్ యాత్రికుల కోసం గ్రాంట్ పెంచటం లాంటివి ఉన్నాయి. వీటితోపాటు కూరగాయల మార్కెట్లలో పరిశుభ్రత నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో బయో మెట్రిక్ నమోదు వరకూ... ఆఫీసుల్లో పాన్ మసాలాల వాడకం రద్దు నుంచి ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం వరకూ... యోగి తీసుకున్న పలు నిర్ణయాలు పాలనలో ఆయన శైలిని నిరూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఉదయం 10 గంటల్లోగా ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ వేయించుకోకుంటే ఆ రోజుకు సెలవుగానే పరిగణిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన చేసిన హెచ్చరికలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జూన్ 15 నాటికి అన్ని రాష్ట్ర రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు, అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరుపై నెలవారీ నివేదికలు, ప్రభుత్వ ఫైల్స్ ఇంటికి తీసుకు వెళ్లకుండా నిషేధం, రాజకీయ నాయకుల సెక్యూరిటీపై సమీక్ష, అధికారులు, మంత్రులు వారి ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న ఆదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, పాఠశాలలకు టీ షర్టులు వేసుకుని వెళ్లకుండా ఉపాధ్యాయులపై ఆంక్షలు, స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు వంటి నిర్ణయాలు ఉన్నాయి.

అయితే వీటిలో కొన్నింటిపై తీవ్ర విమర్శలు వస్తున్నా, ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందడుగే వేస్తున్నారు. ఇప్పటికే మాంసాహర విక్రయాల విషయంలో నిబంధనలపై అసంతృప్తితో ఉన్న వ్యాపారులు నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. రామ మందిర విషయంలో సానుకూల ధృక్పతథతో ఉన్న ఆదిత్యనాథ్ వ్యవహార శైలిపై పలువురు మండిపతున్నారు. బాబ్రీ మసీదు, రామ జన్మభూమి విషయమై నెలకొన్న వివాదంలో కోర్టు బయట ఎటువంటి సెటిల్ మెంటుకు తాము అంగీకరించేది లేదని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ తేల్చిచెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోదీ, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నంతకాలం, ఈ విషయంలో ముస్లింలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, వీరిద్దరూ బీజేపీ వారేనని, అలాంటప్పుడు రామ మందిరంకే మద్దతిస్తారని ఆరోపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Yogi Adithyanath  Quick Decisions  

Other Articles