ఏ దేశమేగినా ఎందుకాలినా పోగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ రాయప్రోలు చెప్పిన మాటను అలకించినట్టు లేరు.. కేవలం ధనార్జనే పరమావధిగా రాత్రికి రాత్రి కుభేరులు కావాలని కలలు కంటూ వక్రమార్గం పట్టిన ఇద్దరు భారతీయ అమెరీకన్లు చిట్టచివరకికి దేశం కానీ దేశంలో ఊచలు లెక్కబెడుతున్నారు. రెండు వందల మిలియన్ డాలర్ల క్రెడిట్ కార్డు కేసులో మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు అక్కడి న్యాయస్థానం కారగారశిక్షను విధించడంతో పాటు ఐదు వేల రూపాయల జరిమాను కూడా విధించింది.
న్యూజెర్సీలోని జెర్సీ పట్టణంలో రాజా జెవలెర్స్ పేరున వీరిద్దరు బంగారు అభరణాల వ్యాపారం చేస్తున్నారు. 2013లో వీరిద్దరు కలసి వక్రమార్గంలో డబ్బులు సంపాదించేందుకు పథకం వేశారు. ఆ ఫతకంలో భాగాంగా దాదాపు 7వేల తప్పుడు అడ్రస్ లను సృష్టించడంతో పాటు వాటికి అనుగూణంగా అడ్రస్ ప్రూఫ్ లను కుడా సృష్టించారు. వీటితో వేల సంఖ్యలో క్రెడిట్ కార్డులు రాబట్టి వాటి ద్వారా పెద్ద మెత్తంలో మోసానికి పాల్పడ్డారు. తప్పుడు అడ్రస్ లతో క్రెడిట్ కార్డులు తీసుకోవడంలో మోసమేముంది అంటారా..?
ఇలా వారు పొందిన తప్పుడు క్రెడిట్ కార్డులతో వారు షాపింగ్ చేశారు. అది ఎక్కడో బయట కాదు.. తమ దుకాణంలోనే. తప్పడు అడ్రస్ లపై తీసుకున్న క్రెడిట్ కార్డుల మొత్తం (అదే నండి క్రెడిట్ లిమిట్ మొత్తం) తమ దుకాణం ఖాతాల్లోకి వచ్చేలా అన్నింటిని స్వైప్ చేశారు. ఇలా దాదాపుగా 200 మిలియన్ డాలర్లను తమ ఖాతలో జమచేసుకున్నారు. క్రెడిట్ కార్డుదారులు ఎంతకీ తమ రుణాలను చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన సంస్థలు దర్యాప్తు అధికారులకు విషయాన్ని తెలిపారు.
దీంతో విచారణ జరపిని పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. దుకాణ యజమానులే తప్పుడ అడ్రస్ లను, ఐడీ ప్రూఫ్ లను సృష్టించి మోసానికి పాల్పడ్డారని తేలింది, దుకాణ యజమానుల బండారం బయటపడటంతో వారిని అరెస్టు చేసిన దర్యాప్తు బృందాలు వారిని న్యాయస్థానాలకు తరలించగా, విజయ్ వర్మ(49), తర్సీం లాల్(78) లకు మొత్తం 14 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు వీరిద్దరికీ ఐదు వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. శిక్షాకాలం తరువాత 12 నెలల పాటు ఇంటిలోనే వుండాలని కూడా న్యాయస్థానం అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more