దేశానికి ఉన్నత విద్యాబ్యాసం కోసం వచ్చిన అఫ్రికా దేశాలకు చెందిన నైజీరియన్ విద్యార్థులపై స్థానికులు దాడి చేసిన ఘటనలో నిష్పక్షపాత. వేగవంతమైన విచారణ చేస్తామని ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ హామి ఇచ్చారు. నైజీరియన్లపై దాడులు జరగడానికి డ్రగ్స్ విక్రయం చేస్తున్నారన్న అభియోగాలను స్థానికులు మోపిన నేపథ్యంలో ఈ విషయంలో లోతైన విచారణ జరిపి నిజానిజాలను బాహ్యసమాజానికి తెలియజేస్తామని చెప్పారు.
గ్రేటర్ నోయిడా పరిధిలోని ఓ స్థానిక విద్యార్థి అత్యంత అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్ల మరణించాడన్న వార్తలతో మృతుడి బంధువులతో పాటు స్థానికులు నైజీరియన్ విద్యార్థులపై దాడులకు దిగారు. స్థానికంగా వుండే నైజీరియన్లు ఈ వార్త తెలిసి పరగు లఖించుకోగా, ముగ్గురు విద్యార్థులు మాత్రం అందోళనకారులకు చిక్కారు. దీంతో వారిపై స్థానికలు కర్రలు, ఇనుపరాడ్లు తదితదరాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు స్థానికంగా వున్న సీసీ టీవీ ఫూటేజీలలో చిక్కడంతో ఈ వార్త కాస్తా వైరల్ గా మారింది.
అయితే ఒక బాధిత నైజిరియన్ విద్యార్థి సాధిక్ బెల్లో.. తమపై అకారణంగా స్థానికులు దాడులు చేస్తున్నారని, ఈ క్రమంలో స్థానికుల నుంచి తమ ప్రాణాలకు తీవ్ర ముఫ్పు పొంచివుందని పేర్కోంటూ ఏకంగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా తన బాధను, అవేదనను వెల్లబోసుకున్నాడు. దీనిపై వెనువెంటనే స్పందించిన సుష్మాస్వరాజ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాత్ తో ఫోన్ పై చర్చించారు. విదేశీ యువకులపై దాడిలో నిష్పక్షపాత విచారణ, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అమె చెప్పారు.
సుష్మ అదేశాలతో యోగీ అదిత్యనాథ్ పోలీసుల ఉన్నతాధికారులకు తక్షణం ఈ కేసు విచారణ చేయాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అదేశించారు. ఆ తరువాత ఈ కేసులో నేరస్థులందరిపైనా వేగవంతమైన చర్యలు తీసుకుంటామన్నారు. విదేశీ విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more