తిండి లేదు. జీతం ఇవ్వరు.. పైగా వేధింపులు... జవాన్లను కాలి కోర్టు కెక్కారు. | Harassed CISF jawans collectively seek legal aid.

Cisf jawans move karnataka high court

CISF Jawans, CISF Kempegowda International Airport, Kempegowda International Airport Deployed Staff, Jawans Karnataka High Court, CISF Suicides, Central Armed Police Forces (CAPF) Suicides, Central Armed Police Forces (CAPF) Problems, Jawans Facilities, CISF Jawans Bangalore High Court, Jawans at Airport

200 'harassed' CISF jawans move Karnataka high court. All are working at CISF personnel deployed at Kempegowda International Airport (KIA) notwithstanding, difficult working conditions, poor food, non-payment of allowances and alleged harassment by seniors have forced more than 200 of them to collectively seek legal aid.

వేధింపులు భరించలేక జవాన్లు ఏం చేశారంటే...

Posted: 04/03/2017 11:06 AM IST
Cisf jawans move karnataka high court

సుమారు 200 మంది జవాన్లు తమ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. అయినా సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఏకంగా న్యాయ వ్యవస్థ తలుపును తట్టారు. కర్ణాటక హైకోర్టు లో సీఎస్ ఎఫ్ జవాన్లంతా మూకుమ్మడిగా ఈ కేసు నమోదు చేయటంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

వీరంతా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే వీరికి సరైన సదుపాయాలతోపాటు, వేధింపులు కూడా అధికం అవుతున్నాయంట. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. కొంత మంది మోదీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

దీంతో నేరుగా బెంగళూర్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. తిండి చాలా చండాలంగా ఉంటుంది. విశ్రాంతి లేకుండా విధులను నిర్వహించాల్సి వస్తుంది. ఇంటి అద్దె, రావాల్సిన చాలా అలవెన్సులు రావటం లేదు. పైగా సీనియర్ల నుంచి వేధింపులు, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవటం లాంటివి జరుగుతున్నాయంటూ వారు వాపోతున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఎఫీఎఫ్) కింద ఉన్న వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల తీవ్ర ఒత్తిడి, వేధింపులు, దుర్భర పరిస్థితులతో గత మూడేళ్లలో 344 మంది ఆత్మహత్య చేసుకోవటం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుంది.

ఇందులో 53 మంది సీఐఎస్ఎప్ కి చెందిన వారు కావటం గమనార్హం. ఈ జనవరిలోనే ఇదే ఎయిర్ పోర్ట్ లో విధులు నిర్వహించిన గైక్వాడ్ సురేష్ సర్వీస్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకోగా, కుటుంబ కలహాలు అని అధికారులు, లేదు సీనియర్ల వేధింపులు అని తోటి జవాన్లు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CISF Jawans  Karnataka High Court  Legal Aide  

Other Articles