స్థానికులకే ఉద్యోగాలు అన్న నినాదంతో వీసా నిబంధనల్లో సమూల మార్పులు తెచ్చి వలసదారులకు పెద్ద షాక్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొండిగా తీసుకున్న ఈ నిర్ణయం మూలానా భారత్ లాంటి వలసలు ఎక్కువగా ఉన్న దేశానికే నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా భారత ఐటీ ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బగా బాధపడుతున్న వేళ ఇప్పుడు సింగపూర్ కూడా అలాంటి నిర్ణయమే ప్రకటించి మరో షాక్ ఇచ్చింది.
అగ్ర రాజ్యం బాటలోనే నడుస్తూ భారత ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇప్పటికే జారీ చేయాల్సిన వీసాల సంఖ్యను కూడా భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించి తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. వీటితోపాటు వర్క్ వీసాలు పొందిన వారి సంఖ్య గణనీయంగా తగ్గించగా, ఇది సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద నియమావళికి విరుద్ధమని వాణిజ్య విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వీసాల సమస్య గత సంవత్సరం నుంచే ప్రారంభమైందని, అన్ని భారత కంపెనీలకూ ప్రభుత్వం నుంచి వీసాల కోత, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై నోటీసులు ఇచ్చాయని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ముఖ్యంగా సర్వీస్ ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. కాగా, సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజంట్, ఎల్ అండ్ టీ తదితర ఐటీ సంస్థలు ఎంతో మంది భారతీయులను అక్కడికి తీసుకువెళ్లి పనులు జరిపించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు హెచ్-1బీ వీసాలపై ఆందోళన అక్కర్లేదని గత వారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హమీ ఇచ్చాక కూడా సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఆందోళన రెకెత్తిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more