అది గుజరాత్ లోని జునాగఢ్ ఎంజీ రోడ్ ఏరియా. రోడ్డు పక్కన ఓ వ్యక్తి పాత చెప్పులను కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతగాడి పేరు దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అందుకు కారణం అతనేం సాధించటం కాదు. ఆదాయపు పన్నుల శాఖ అధికారులు చేసిన నిర్వాకం.
అవును చెప్పులు కుట్టుకునే ఆ వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ దిమ్మదిరిగే షాకిచ్చింది. నోట్ల రద్దు సమయంలో జన్‌ధన్ ఖాతాలో రూ.10 లక్షల లావాదేవీకి లెక్కలు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో అవాక్కయిన మన్షుక్ మక్వాన్ (55) తన ఖాతాలో అంత డబ్బు ఉందా? అని ఆశ్చర్యపోయాడు. ఆపై అవాక్కయ్యాడు.
తన జీవితంలో అంతపెద్దమొత్తంలో ఎప్పుడూ డబ్బు చూడలేదని పేర్కొన్నాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే తనకు వచ్చేది కేవలం రూ.200 నుంచి 250 సంపాదిస్తానని పేర్కొన్నాడు. అలాంటిది తన ఖాతాలో రూ.10 లక్షలు ఎలా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా, ఈ ఘటన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర మష్రూ అతనికి బాసటగా నిలిచాడు. ఈ విషయంపై తాను ఐటీ అధికారులతో మాట్లాడుతానని భరోసా ఇచ్చాడు.
మరోవైపు మన్షుక్ భాయ్ కి రెండు అకౌంట్లు ఉన్నాయని విచారణంలో తేలింది. ఒకట ప్రధాని జన్ ధన్ అకౌంట్ స్కీంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉండగా, మరో కటి ఇండియన్ బ్యాంక్ ఖాతా ఉంది. అయితే ఈ రెండంటిలో దేనిలో 10 లక్షలు జమ అయ్యాయన్న విషయంపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటం అనుమానాలకు తావునిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more