అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ నటరాజన్ కు సోమవారం రెండు షాక్ లు తగిలాయి. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను వేరే జైలుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక న్యాయస్థానం దానిని కొట్టివేసింది. పరప్పన అగ్రహార జైలు పక్క రాష్ట్రంలో ఉండటం, ఆమెను చూడటానికి పలువురు ప్రముఖులు తరచూ అక్కడికి వెళ్తుండటం చూస్తున్నాం.
అయితే జైలు నుంచే ఆమె పాలన సాగిస్తున్నారని, అందుకని ఆమెను తుముకూరులోని మహిళా జైలుకు బదిలీ చేయాలని కోరుతూ, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో శశికళను కలిసేందుకు మంత్రులను అనుమతించవద్దని పిటిషన్లో విజ్నప్తి చేశాడు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. కలిసే ప్రతీ ఒక్కరికీ నిబంధనలు వర్తిస్తాయని, అందరికీ ఆమెను కలిసే అవకాశం ఉందని పేర్కొంది.
శశికళ బ్యాచ్ పై ఈసీ ఆగ్రహాం....
ఆర్కే నగర్ ఉపఎన్నికలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గీయుల మధ్య గుర్తు కోసం సమస్య తలెత్తటంతో ఈసీ రెండాకుల గుర్తును ఫ్రీజ్ చేసి ఒకరికి టోపీ, మరొకరికి కరెంటు స్తంభం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, శశికళ వర్గం మాత్రం సోషల్ మీడియా ప్రచారంలో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది. పార్టీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటి నుంచి వెంటనే రెండాకుల గుర్తును తీసేయాలని ఆదేశించింది. అలాగే, అన్నాడీఎంకే పేరు, గుర్తును ఉపయోగించకూడదని తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరించాలంటూ అందుకు గురువారం ఉదయం వరకు సమయం ఇచ్చింది.
ఈసీ చెప్పాక కూడా ఉపయోగించడం ఐపీసీ 171జి సెక్షన్ ప్రకారం ఎన్నికల నేరమే అవుతుందని స్పష్టం చేసింది. రెండాకుల గుర్తును ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలలోను, పార్టీ వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి చోట్ల వాడటాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more