ఆంద్రప్రదేశ్ అధికార పక్ష పార్టీలో మంత్రివర్గ విస్తరణ పెద్ద చిచ్చే పెట్టింది. పదవులు పొందలేకపోయిన వారు పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు యత్నించటం, అధినేత చంద్రబాబు వారిని బెదిరించినట్లే బెదిరించి బుజ్జగించేందుకు బరిలోకి దిగటం చూశాం. బొజ్జల గోపాలకృష్ణ, శివాజీ, చింతమనేని మొదలైన వారు కాస్త శాంతించగా, కాగిత ఏకంగా ముఖ్యమంత్రిని కలసి తన గోడును వెల్లగక్కుకున్నాడు. ఇక కాస్త బెట్టు చేస్తున్న గోరంట్లతో మంత్రి చినరాజప్ప సమావేశం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. ఇక వారిని సంతృప్తి పరిచే విధంగా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మండలిలో ఖాళీగా ఉన్న కీలక పదవులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను నేతలకు కట్టబెట్టే దిశగా యత్నాలు మొదలుపెట్టిన చంద్రబాబు ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లతో కూడిన జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో 26 మందికి మించి చోటు కల్పించలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఓపెన్ గానే ప్రకటన చేసిన ఆయన ఇతర నేతలకు మండలిలో త్వరలో ఖాళీ అయ్యే పలు పదవులను ఇవ్వనున్నారు.
లిస్ట్ లో ఉంది వీరేనా?
శాసనమండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి మే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ అవకాశం కర్నూల్ కీలక నేత అయిన శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. భూమా వర్గానికి ఓ మంత్రి పదవి ఇవ్వడం, శాసనసభకు ఆంధ్రా ప్రాంత నేత సభాపతిగా ఉండటంతో, శిల్పాకు లైన్ క్లియర్ అయినట్లేనని అనుకోవాలి. మండలి చీఫ్ విప్ పదవిని పయ్యావుల కేశవ్ కు ఇచ్చి, అయనకు క్యాబినెట్ హోదాను కల్పించాలని, రెండు, మూడు విప్ పదవులకు అన్నం సతీశ్, బుద్ధా వెంకన్న, బీద రవిచంద్ర, యలమంచిలి బాబూరాజేంద్ర ప్రసాద్, చిక్కాల రామచంద్రరావు తదితరుల పేర్లను ఆయన తుది దశ వడపోతలో పరిశీలిస్తున్నారు.
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను అదే సమయంలో భర్తీ చేయాల్సి వుంది. వీటిల్లో ఒకటి కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారైపోయింది. రెండో స్థానానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకున్నందున ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే విషయమై, మేలో జరిగే మహానాడులో నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది.
ఎమ్మెల్సీలుగా కూడా ఎంపిక చేయలేకపోయిన వారిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు కార్పొరేషన్లతో పాటు ఆలయ కమిటీలను భర్తీ చేస్తే, తృతీయ శ్రేణి నాయకుల వరకూ అందరినీ సంతృప్తి పరచవచ్చని, ఈ ప్రక్రియను వచ్చే నాలుగైదు నెలల్లో పూర్తి చేసి ఆపై 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలన్నది చంద్రబాబు అభిమతంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి తెలుగుదేశం అధినేత కేబినెట్ ర్యాంకుతో కూడిన ఒక పదవిని ఆఫర్ చేశారట. ప్రభుత్వ సలహాదారుగా నియమించే హామీతోనే బొజ్జల వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇక పదవిని పోగొట్టుకున్న మరో నేత పల్లె రఘునాథ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొన్నటి వరకూ ఈ పదవిలో కాలువ శ్రీనివాసులు ఉండే వారు. ఇప్పుడు అది పల్లెకు దక్కబోతోందని సమాచారం. ఇక మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుని ఫిరాయింపుదారుల్లో ఒకరికి విప్ పదవి దక్కనున్నట్టుగా తెలుస్తోంది. కానీ, కేవలం మంత్రి పదవుల కోసమే ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న పెద్ద చేపలకు ఈ ఎర ఏ మేర సరిపోతుందో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more